కళారంగంలో బంగార’రాజు’

ఆరు దశాబ్దాలుగా కళారంగంలో నటునిగా, దర్శకునిగా, చిత్రకారునిగా, కవిగా, వక్తగా, పుస్తక రచయితగా, స్టేజ్ డిజైనర్ గా, బహుముఖప్రజ్ణావంతుడిగా రాణిస్తున్న కొత్తపల్లి బంగారరాజు గారు పుట్టింది భీమవరం దగ్గర పాలకోడేరు గ్రామంలో 1947 ఫిబ్రవరి 1 తేదీన. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైన వీరు అనేక అంశాలలో డిప్లొమా కోర్సులు చేశారు. వీరి ప్రస్తుత నివాసం విశాఖపట్నం లో.

బి.హెచ్.పి.వి. (భారత్ హెవిప్లేట్స్ & వెసెల్స్ లిమిటెడ్ – విశాఖపట్నం) ఉద్యోగాలకు మెషీన్ డ్రాయింగ్ పరీక్ష పెట్టినప్పుడు ఉతీర్థుడైతే, డ్రాప్ట్సుమెన్ డిజైన్ ఆఫీసుకు ఎంపికయి, 7 సం.లు ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ గీశారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తైలవర్ణ చిత్రాలు (OIL PAINTINGS) నెలరోజులు కోర్సులో ప్రముఖ చిత్రకారుడు శ్రీ ఎ. రాజన్ గారి వద్ద నేర్చుకున్నారు. మూడు తైలవర్ణ చిత్రాలు రచించి తన డ్రాయింగ్ రూంలో ప్రదర్పించారు.
శ్రీరాజన్ గారి వద్ద ఒక వారం రోజులు గ్రీటింగ్ కార్డ్స్ లో వాటర్ కలర్స్ చిత్రించడం నేర్చుకున్నారు.
పాలకోడేరులో మైస్కూల్లో విద్యలో ప్రముఖ చిత్రకారుడు శ్రీ చల్లా కోటి వీరయ్యగారి వద్ద డ్రాయింగ్స్ నేర్చుకున్నారు. ఫొటోగ్రఫీలో కూడా ప్రవేశం వుంది.

ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ, యు.జి.సి. గ్రాంట్స్, “జానపద కళలు” (FOLK ARTS) అనే అంశం మీద పత్రం సమర్పణకు ఎంపికచేసి, రాష్ట్రస్థాయి నదస్సు, 2-రోజులుకు ఆహ్వానించగా పత్రం సమర్పించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఢిల్లీ) వారు, ఆంధ్రవిశ్వవిధ్యాలయం సంయుక్తంగా నిర్వహించిన 70 రోజులు వర్క్ షాప్ కు ఉభయ రాష్ట్రాలలో 85 మంది కళాకారులు ఇంటర్వ్యూకి హాజరై నప్పుడు 32 మందిని ఎంపిక చేశారు. వారిలో ప్రత్యేకముగా సెట్ డిజైనర్ గా ఎంపికయిన కళాకారుడు బంగారరాజు గారు!

సైన్సు పాఠాలలో బొమ్మలు బాగా గీసే రాజు గారిని, తోటి విద్యార్థులు మెచ్చుకొనేవారు.
టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (హైదరాబాద్) వారు, డ్రాయింగ్ గ్రేడ్-1 పరీక్షలు పాస్ అయ్యారు.
చిత్రకళానికేతన్ (అక్కయ్యపాలెం, విశాఖపట్నం) లో జామిట్రికల్ ఆర్ట్ మాస్టర్ గా ఆదివారాల్లో విద్యార్థులకు క్లాసులో చెప్పారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఢిల్లీ) వారి వర్క్ షాప్ లో ప్రఖ్యాత స్టేజ్ డిజైనర్ శ్రీ వి. రామమూర్తి (బెంగులూరు) వారి విద్యను అభ్యశించారు.

ఆంధ్రవిశ్వవిధ్యాలయంలో రంగస్థల కళల శాఖలో, నటన, మరియు దర్శకత్వంలలో డిప్లమోలు చేసి నప్పుడు ప్రఖ్యాత చిత్రకారుడు డా. అబ్బూరి గోపాలకృష్ణ వద్ద సెట్ డిజైన్ నేర్చుకున్నారు.
ఆంధ్రవిశ్వవిధ్యాలయంలో రంగస్థలకళల శాఖలో, అతిథి ఉపాధ్యాయుడిగా సెట్ డిజైన్ బోధించారు. పరీక్షాధికారిగా ఓరల్ పరీక్షలు నిర్వహించారు. అనేకచోట్ల ప్రసంగాలు కూడా చేశారు. అనేక నాటకాలకు సెట్ డిజైన్ డ్రాయింగ్స్ వేశారు. సెట్స్ మీద పుస్తకాలు రాసి, ప్రచురించారు. కొన్ని పుస్తకాలకు ముఖచిత్రాలు చిత్రించారు.
ఎ-1 డ్రాయింగ్ షీట్స్ మీద, పోస్టర్ కలర్ షీట్ మీద నాటకాలకు ఎడ్వర్ టైజ్ మెంట్స్ కోసం బొమ్మలు చిత్రించే వారు, గ్రీటింగ్ కార్డ్స్ కూడా స్వయంగా తయారుచేసుకొన్నారు.

చిత్రకళలో ప్రవేశం ఉండటంతో, కొన్ని నాటకాలకు మేకప్ కూడా చేసేవారు. స్వంతంగా మేకప్ కిట్ కూడా కొనుక్కున్నారు.
ఆంధ్రవిశ్వవిధ్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ శాఖలోను, తెలుగు విశ్వవిధ్యాలయం (హైదరాబాద్) లోను, తెనాలిలో రెండు రోజులు సెమినార్స్ ను ప్రసంగాలు చేశారు. బాల్యం నుంచి చిత్రకళ మీద, నాటక రంగం మీద అభిరుచి ఉండటం వల్ల పెయింటింగ్స్ లోను, రంగస్థల కళలలోనూ కృషి చేస్తున్నారు. చిత్రకళ నేర్చుకున్నా, చిత్రకారుడు కావాలని మాత్రమే కృషి చేయలేదు. నేర్చుకున్న విద్యను రంగస్థల కళలకు ఉపయోగిస్తున్నారు.
కళాసాగర్ గారు (విజయవాడ) “ఆంధ్రకళాదర్శిని” లో రాజు గారి గురించి వ్రాశారు.


గురువులు శ్రీ చల్లా కోటివీరయ్య, శ్రీ ఎ. రాజన్, డా. గోపాలకృష్ణ అబ్బూరి గార్ల జీవిత రేఖా చిత్రణలను వీరి పుస్తకాల్లో రాశారు, అంకితం చేశారు, ఆడియో వీడియోలు నా స్వంత యు-ట్యూబ్ ఛానల్ లో ఆడియో వీడియోలు చేశారు.

బిరుదులు: నాటక కళారత్న, నాటక అభిజ్ఞ, నాటక విద్యాసాగరుడు, లలిత కళా వాచస్పతి, కళాసేవామణి, నాటక కంప్యూటర్, ప్రపూర్ణ కళానిధి, ప్రయోగాత్మక చక్రవర్తి.

పురస్కారములు:
1) ఉగాది పురస్కారం – విశాఖ కల్చరల్ అకాడమీ (విశాఖ), 1998
2) ఉగాది పురస్కారం – విశాఖ ఫైన్ ఆర్ట్స్ & కల్చరల్ అకాడమీ (విశాఖ), 2005
3) ఉగాది పురస్కారం -(ఉత్తరాంధ్ర) -టి.ఆర్.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ (గాజువాక)
4) ఉగాది పురస్కారం -వేదుల హరి (బొబ్బిలి), 2009
5) పురస్కారం – కళావేదిక పంచమవార్షికోత్సవం (విశాఖ)
6) పురస్కారం – కూరెళ్ల గ్రూప్ ట్రస్ట్ (విశాఖపట్టణం)
7) గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం గరిమ సాంస్కృతిక వేదిక (విశాఖ)
8) ‘గోదావరి మాత’ పురస్కారం- రుద్రరాజు పాడేషన్ (గణపవరం)
9) ప్రతిఖా ఉగాది పురస్కారం శ్రీప్రభాసాంబ సాహితీ పురస్కారం (విశాఖ)
10) ‘కళాప్రపూర్ణ’ గణపతి రాజు అచ్యుత రామరాజు స్మారక పురస్కారం (విశాఖ)
11) తెలుగు నాటక రంగ పురస్కారం విశాఖపట్టణం
12) చెలమల శెట్టి నాంచారయ్య ఉగాది పురస్కారం (నాటక రంగం) – ఆంధ్రసారస్వత సమితి (మచిలీపట్నం)
13) కందుకూరి విశిష్ట పురస్కారం(కాకినాడ), 2025.

శతాధిక గ్రంథకర్త: నాటకరంగం గురించి పుస్తకాలు రాసేవాళ్లు తెలుగులో తక్కువే… మన రాజుగారు ఆ కొరత తీరుస్తున్నారంటే అతిశయోక్తికాదు. ఇప్పటి వరకు నూటపది కి పైగా పుస్తకాలు రాశారు.

స్వంత Youtube ఛానల్ : నటాలి ఆర్ట్స్ రారాజు పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి- అందులో అనేక అంశాలు పోస్ట్ చేస్తున్నారు. గొప్పవారి జీవిత రేఖా చిత్రణలు, ఆకాశవాణి ప్రసంగాలు, పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలు, నటన, దర్శకత్వము, రచనలలో క్లాసులు సుమారు 300 ఆడియో వీడియోలు పొందుపరిచారు.

కన్వీనర్ : నటాలి తెలుగు లోగిలి (సాహిత్య, సాంస్కృతిక సంస్థ)కు కన్వీనర్ గా వుంటూ సాహిత్య సభలు నిర్వస్తున్నారు.

కళాసాగర్ యల్లపు

K. Bangar Raju was written and published books

4 thoughts on “కళారంగంలో బంగార’రాజు’

  1. బంగార్రాజు గారూ, నమస్కారం… మీ నాటకరంగ కృషి మరియు ఇతర రంగాలలో మీ ప్రతిభ ప్రశంసనీయం.‌‌..
    అనితరసాధ్యం… మీ బహు ముఖప్రజ్ణ విజయవంతంగా కొనసాగించగల శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను… శుభాకాంక్షలు…
    భవదీయమిత్రుడు.
    డా. మోహనరావు కొల్లి, ఏలూరు

  2. శ్రీ కొత్తపల్లి బంగారు రాజు గారి గురించి శ్రీ కళాసాగర్ గారు వ్రాసిన ఈ వ్యాసం స్ఫూర్తిదాయకంగా ఉంది బంగారు రాజు గారికి కళాసాగర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
    డాక్టర్ పి వి ఎన్ కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap