‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ కృష్ణ కు ఇవ్వాలి

తెలుగు సినీవాలీలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మెగా స్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి ఒకే వేదికపై నిలిచిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్, రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాల్ బహదూర్ స్టేడియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది..షాక్‌ తిన్నాను..ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్‌ ఇంత స్పీడ్‌గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంత కంటే ఇంకేం కావాలి..అందరూ ఇలాగే చేయాలి..అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.

ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్‌ కళకళ లాడుతుంటాయి అని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. దిల్‌ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు మహేష్ ను అభినందిస్తున్నా అని అన్నారు చిరంజీవి. మహేశ్‌ ఎంతో ప్యాషనేట్‌గా ఉంటాడు.. ముద్దొచ్చేలా ఉంటాడు.. బిడ్డలాంటి అనుభూతి. ఎప్పుడూ తనలో చెరగని చిరునవ్వు ఉంటుంది. ఆ నవ్వు వెనకాల చిన్న చిలిపితనం కూడా ఉంటుంది..సరిలేరు నీకెవ్వరు పూర్తయ్యే వరకూ మహేశ్‌ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్‌ తీసుకోలేదంటే దాని వల్ల నిర్మాతలకి ఎన్నో కోట్లు, వడ్డీ డబ్బులు మిగులుతాయి.. అది మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం.

నేను కూడా సినిమా పూర్తయ్యాకే డబ్బు తీసుకునేవాణ్ణి. దాన్నిప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఆచరిస్తున్నాడు. మహేశ్‌ కూడా అలా చేసి, నిర్మాతలకి వెన్ను దన్నుగా నిలబడటం గ్రేట్‌.. ఈ రోజుల్లో అది అవసరం. షూటింగ్‌ డేస్‌ పెరగడం వల్ల బడ్జెట్‌ వృథా అయిపోతోంది..నా తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ కూడా 80 నుంచి 99 రోజుల్లోనే పూర్తి చేస్తానని మాటిచ్చాడు. మన సౌత్‌ ఇండియాలోనే సీనియర్‌ మోస్ట్‌ యాక్టర్‌ కృష్ణ గారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చేలా నిజాయతీగా కృషి చేయాలి. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం. మహేశ్‌తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేశ్‌ వస్తుండటం ఆయనకి గర్వకారణం. చరణ్‌ విషయంలో నాకూ అంతే.
ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అనీల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు లాంటి నిష్ణాతులున్నారు. ఈ సినిమాతో పాటు సంక్రాం తికి విడుదలవుతున్న ‘అల వైకుంఠపురములో.., మా ఫ్రెండ్‌ రజనీ ‘దర్బార్‌’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అవ్వాలి.. సినిమా పరిశ్రమ బాగుండాలి.. వాటి దర్శక, నిర్మాతలు బాగుండాలి అన్నారు. ఒక్కడు సినిమా చూసిన చిరంజీవిగారు నాకు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత కలిసి రెండు గంటలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అర్జున్‌ సినిమా షూటింగ్‌లో మా సెట్‌కు వచ్చి, ఆ సెట్‌ను చూసి నీలాంటి వారు ఇండస్ట్రీలో ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకుకెళ్లాలని చెప్పిన మాటలు గుర్తున్నాయి.
పోకిరిలో నా నటన గురించి, సినిమా గురించి రెండు గంటలు మాట్లాడారు.. మీరు ఎప్పటికీ నాకు స్ఫూర్తి సార్‌. భరత్‌ అనే నేను, మహర్షి రిలీజ్‌ అయినప్పుడు అభినందనలు చెబుతూ తొలి ఫోన్‌ కాల్‌ ఆయన నుంచే వచ్చిందన్నారు మహేష్ బాబు.1979 నుంచి 2020 వరకూ లాంగ్‌ జర్నీ. అందరితో కలిసి నడిచాను..నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమకు నన్ను పరిచయం చేసింది హీరో కృష్ణ , విజయనిర్మల. నా సక్సెస్‌ఫుల్‌ హీరో కృష్ణగారని చెప్పుకుంటాను. సినిమాల్లోకి నా రీ–ఎంట్రీ మహేశ్‌తో కావడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్‌ అబ్బాయి వచ్చినా తనతోనూ యాక్ట్‌ చేస్తాను. వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్‌ చేయిస్తున్న మహేశ్‌ సినిమాలోనే కాదు.. బయట కూడా సూపర్‌స్టారే.

చిరంజీవి గారు, నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం.. అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి అన్నారు విజయశాంతి. పొద్దున్నే నాకు కొడుకు పుట్టాడు.. సాయత్రం ఈ వేడుక. ఇలాంటి రోజు.. నెవర్‌ బిఫోర్‌… ఎవర్‌ ఆఫ్టర్‌. స్వయంకృషితో, కష్టంతో మనం ఎలా ఎదగాలో నేర్పిన పేరు చిరంజీవి గారు. 40 ఏళ్లుగా వింటున్న పేరు అది. మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్‌ ఉంటుంది.. నాలో కళ పుట్టడానికి కారణం చిరంజీవి గారే. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ విన్న మహేశ్‌గారు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ సినిమా చేస్తున్నాం అని చెప్పిన క్షణాల నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్‌ జరుగుతున్నప్పటి వరకు సాగిన ఈ ప్రయాణంలోని ముఖ్యమైన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ సుంకర, దిల్ రాజు, సుధీర్ బాబు, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక, సంగీత, తదితరులు మాట్లాడారు. అంతకు ముందు పలువు గాయనీ గాయకులూ పాటలతో అలరించారు. కాగా చాన్నాళ్ల తర్వాత నా ఫ్రెండ్ విజయశాంతి తో మళ్ళీ కలిసేలా చేసినందుకు మహేష్ బాబుకు స్పెషల్ గా థాంక్స్ చెప్పారు మెగాస్టార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap