మే 6న కృష్ణా విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్ కాంపిటీషన్స్
కృష్ణా విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలలతో పాటుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలలో ఉన్నత విద్యా అభ్యశిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థుల యొక్క వివిధ కళలలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే ఉద్దేశ్యంలో భాగంగా “జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్ కాంపిటీషన్స్ ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.బి. చంద్రశేఖర్ వారి ఆదేశానుసారం ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ’ వారితో కలిసి సంయుక్తంగా విశ్వవిద్యాలయంలోని NCC మరియు NSS విభాగాల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు NCC అసోసియేట్ అధికారి డా. డి. రామశేఖర్ రెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ’ ప్రతినిధులతో పాటు విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కె.బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళ వేడుకల్లో భాగంగా ‘ఆజాధీ కా అమృత మహోత్సవ్’ లో భాగంగా “ఆంధ్ర చిత్ర కళా వైతాలికుడు” ప్రముఖ చిత్రకారుడు దామర్ల రామారావుగారి 125 వ జయంతిని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ జాతీయ స్థాయి ప్రదర్శన మరియు చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ‘ వారి సహకారంతో మే నెల ఆరవ తేదీన నిర్వహించనున్నారు.
ఈ చిత్రా కళా ప్రదర్శనలో
- స్వాతంత్ర్య సమరయోధులు
- భారతీయ సంస్కృతి మరియు వారసత్వం మొదలైన జాతీయ అంశాలతో పాటు వివిధ ప్రముఖమైన అంశాలపై చిత్రాలను ప్రదర్శించనున్నారు.
పెయింటింగ్ సైజ్: 2×3 అడుగుల లోపు సైజ్ వుండాలి. (మీడియం: వాటర్, ఆయిల్ లేదా యాక్రలిక్)
ఈ సందర్భంగా మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ జనరల్ సెక్రటరీ బి.ఎస్.వి.రమేష్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కళలకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తుందనీ రాబోవు రోజుల్లో విశ్వ విద్యాలయం ఉపకులపతి వారి ఆదేశానుసారం విశ్వవిద్యాలయంలో కళలు పెంపొందించుటకు తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా NCC అధికారి డా.డి. రామశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ భావం కల ఇలాంటి కార్యక్రమాలతో NCC విద్యార్ధుల జీవితాన్ని మలచుకొనుటకు ఎంతో ఉపకరిస్తాయని ఈ అవకాశం NCC విభాగానికి ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఉపకులపతికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.బి. చంద్ర శేఖర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.బాబు రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు, NCC అధికారి డా.డి. రామ శేఖర రెడ్డి, ఇతర అద్యాపకులు ఆచార్య ఈ.దిలీప్, ఆచార్య ఎం. కోటేశ్వరరావులతో పాటు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ జనరల్ సెక్రటరీ బి.ఎస్.వి. రమేష్, వైస్-ప్రసిడెంట్ పి.ఎస్.ఎస్. ప్రసాద్ లు పాల్గొన్నారు.
__________________________________________________________________
జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్ కాంపిటీషన్స్ లో గారి పాల్గొనాలనుకునే వారు క్రింది లింక్ ద్వారా గూగుల్ ఫారం ఫిల్ చేసి రిజిష్ట్రేషన్ చేసుకొండి.
Art exhibition registration link:
https://forms.gle/c57vz1qqmqJm1mv47
Drawing competition registration link:
https://forms.gle/CX49D6UrxqwNuA5u7
Thank you sir
Thank you sir💐👍
Thank you sir
Leader