కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర

(కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేళ ఆవిర్భావం, సాహితీ కృషి ల గురించి…)

“నిరీశ్వరా పశదేశా, ఆంధ్రస్వీకోన్ సేశ్వర యత్రాస్తే భగవాస్ విష్ణు, ఆంధ్రనాయక సంజ్ఞయా”
ఇతర దేశీయుల భాషలకు దేవుడు లేడు. ఒక్క తెలుగు భాషకే ఉన్నాడు! ఆంధ్రనాయకుడని తెలుగు రాయడని, తెలుగు వల్లభుడని ఆయన ప్రశస్తి. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువుగా ఆయన కొలువై ఉన్నాడు. తెలుగు కోసం అనాదిగా నడిచిన అనేక ఉద్యమాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి…
సాహితీ సామాజిక ఉద్యమాలకు కృష్ణాజిల్లా పుట్టిల్లు. జనచైతన్యానికి ప్రతీక. 160 యేళ్ల క్రితం కోరాడ రామచంద్రశాస్త్రిగారు వ్రాసిన తొలి తెలుగు నాటకం మంజరీ మధుకరీయం, 120 యేళ్ల క్రితం కొమర్రాజు లక్ష్మణరావుగారు ఉపిరి పోసిన భావోద్యమం తొలి తెలుగు దినపత్రిక ‘దేశాభిమాని’ నుంచి స్వాతంత్రోద్యమ దీప్తి నిచ్చిన ‘కృష్ణాపత్రిక’ వరకూ ఎన్నో పత్రికలు కృష్ణమ్మ ఒడిలో పుట్టి పెరిగాయి. ప్రతిపదమూ ఒక కావ్యంగా వెలుగొందిన క్షేత్రయ్య, కూచిపూడివారు దైవసమానుడిగా కొలిచే సిద్ధేంద్రయోగి, శకపురుషుడు శ్రీ చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, పరిశోధక పరమేశ్వరులు వేటూరి ప్రభాకరశాస్త్రి వీరంతా కృష్ణమొడ్డు జాతీయులే!

సాహితీమూర్తులు శ్రీయుతులు విశ్వనాధ సత్యనారాయణ, శ్రీ అడవి బాపిరాజు, కాటూరి వెంకటేశ్వరరావు, వేలూరి శివరావు శాస్త్రి, ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, మల్లాది రామకృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకట చలం, నార్ల వెంకటేశ్వరరావు, బసవరాజు అప్పారావు ఇలా ఎందరో ఈ కృష్ణా మండలంలో సాహితీ సుసంపన్నతకు కారకులయ్యారు.

రచయితలకు హద్దులు, సరిహద్దులూ వుండవు. కానీ, జనన, గమనాలు ఈ కృష్ణామండలంతో ముడివడిన రచయితలను గౌరవిస్తూ, అన్ని ప్రాంతాల నుంచీ విచ్చేసిన రచయితల సమకంలో స్వర్ణోత్సవాలు జరుపుకోవాలని ఆకాంకు. కృష్ణాజిల్లా రచయితల సంఘం అవతరణ 50యేళ్ల క్రితం కృష్ణాజిల్లా రచయితల మహాసభలతో ఈ సంఘానికి బీజావాపన జరిగింది. 1967,1968, 1970లలో శ్రీ కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి, శ్రీ విహారి, శ్రీ నండూరి రామమోహనరావు, శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, శ్రీ ఎంవి యల్ ప్రభృతుల అధ్వర్యంలోనవ్య సాహిత్ సమితి విజయవాడ శాఖ పదాన కృష్ణాజిల్లా రచయితల మహాసభలు మొదటి మూడూ జరిగాయి. 1976లో స్పందన సాహితీ సమాఖ్య పథాన శ్రీ విహారి, శ్రీ శాలివాహన, శ్రీ గుత్తికొండ సుబ్బారావు. శ్రీవైజికె ప్రసాద్, శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి, శ్రీ బూదరాజు శ్యాంసుందర్, అక్కల సరస్వతీ బాబురావు, శ్రీ జి. వి. పూర్ణచందు ప్రభృతులు 4వ మహాసభలు మచిలీపట్టణంలో నిర్వహించారు. కాగా, 1982లో అవనిగడ్డ గాంధీ క్షేత్రం పక్షాన జరిగిన 5వ కృష్ణాజిల్లా రచయితల మహా సభలలో కృష్ణాజిల్లా రచయితల సంఘం అవతరించి, 1983లో రిజిష్టర్ అయ్యింది. మండలి వెంకట కృష్ణారావుగారు గౌరవ అధ్యక్షులుగా, ముక్కామల నాగభూషణంగారు అధ్యకుడిగా, శ్రీమతి తెన్నేటి హేమలత, శ్రీ త్రిపురనేని వెంకటేశ్వర రావు. శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి ఉపాధ్యక్షులుగా, శ్రీ గుత్తికొండ సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ జి.వి. పూర్ణచందు సహాయ కార్యదర్శులుగా, శ్రీ మైత్రేయ కోశాధికారిగా తొలికార్యవర్గం ఏర్పడింది. శ్రీ ఎం. ఆర్. అప్పారావు, శ్రీ దాశరధి. శ్రీ సంజీవదేవ్, డా. సి. నారాయణరెడ్డి, శ్రీ శీలా వీర్రాజు ప్రభృతులు గౌరవ సలహా మండలిలో ఉండేవారు.

మహాసభలు-సదస్సులు
1984లో తెలుగు విమర్శ పైన, 1986లో తెలుగు నవల పైన, 1988లో తెలుగు కథపైన, 1990లో తూర్పు యూరప్ పరిణామాల పైన, 1992లో కుద్రసాహిత్యం పైన మహాసభలు విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగాయి కాలక్రమంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం పెద్దలు ఒక్కరొక్కరే కాలధర్మం చెందటంతో కొంత విరామం తప్పలేదు. 2004లో తిరిగి జవసత్వాలు పుంజుకుని, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గౌరవాధ్యకుడిగా, శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యకుడిగా శ్రీ జివి పూర్ణచందు ప్రధాన కార్యదర్శిగా, డి. సుజాతా దేవి, విడియాల చక్రవర్తి సహాయ కార్యదర్శులుగా. తాతా రమేష్ బాబు కోశాధికారిగా, ఇంకా అనేక మంది సాహితీ ప్రముఖులతో కార్యవర్గం ఏర్పడింది. కృష్ణా మహోత్సవాలలో సాహిత్య అంశాల నిర్వహణా బాధ్యతలు చేపట్టి, అనాటి నుండి ఈనాటి వరకూ సాహితీ కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తూనే వస్తోంది.

2004-05లలో ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్టణం, కైకలూరు, నూజివీడు, తిరువూరు, అవనిగడ్డ, జగ్గయ్య పేటలలో తెలుగు భాషా సదస్సులు, 2006లో జాతీయ తెలుగు రచయితల మహాసభలు, 2007లో మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, 2011లో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు, 2015లో ప్రపంచ తెలుగు రచయితల మూడవ మహాసభలు, 2019లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం స్థాపన. ప్రపంచ తెలుగు రచయితల నాల్గవ మహాసభలు. ఆంధ్రప్రదేశ్ తొలి రచయిత్రుల మహాసభలు నిర్వహించి కృష్ణాజిల్లా రచయితల సంఘం సాహితీ సంస్థలకు తలమానికంగా నిలిచింది.

జాతీయ, అంతర్జాతీయ సదస్సులు
కవిత్వం వ్రాయటంపై కార్యశాల, రచయితలు కంప్యూటర్ వాడకంపై కార్యశాల, జర్నలిజంపై కార్యశాల, తెలుగు భాష ప్రాచీనతపై జాతీయ సదస్సు. కృష్ణాజిల్లా చారిత్రక వైభవం పై జాతీయ సదస్సు. సింధు-కృష్ణాలోయల నాగరికతల అధ్యయన సదస్సు. న్యాయ స్థానాలలో తెలుగు అమలు-సాధక బాధకాలపై జాతీయ సదస్సు. ‘తెలుగుకథ’ జాతీయ సదస్సు, నడుస్తోన్న భాపోద్యమం’ సమీడా సదస్సు, చిన్నయసూరి ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలు, ‘ఆంధ్రపత్రిక శతజయంతి ఉత్సవాలు, తెలుగు మాండలికాల అద్యయన సదస్సు, శ్రీశ్రీ సాహిత్య సమాలోచన సదస్సు, కృష్ణదేవరాయ వైభవం సదస్సు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిపై సమాలోచన సదస్సు, బుచ్చిబాబు సాహిత్య సమాలోచన సదస్సు, విశ్వనాథ సాహితీ సమాలోచన సదస్సు, క్షేత్రయ్య పదసాహిత్య సదస్సు, తతరాల తెలుగు సంస్కృతి’ సదస్సు, ‘బ్రౌన్ సాహిత్యం’ సదస్సు ఇలా జాతీయ అంతర్జాతీయ సదస్సులెన్నో నిర్వహించింది.

బృహధంథాల ప్రచురణ:
2006లో తెలుగు పసిడి’, ‘తెలుగు భాషోద్యమం -కరదీపిక, 2007లో వజ్రభారతి’, ‘స్వర్ణయానం’, 2008లో ‘తెలుగు భాష విశిష్ట ప్రాచీన సంపన్నత 2010లో ‘తెలుగు మణిదీపాలు’ వ్యాస సంపుటి, 2011లో ‘కృష్ణాజిల్లా దారిత్రక సర్వస్వం’, ‘తెలుగు వ్యాసమండలి’. ‘తెలుగు పున్నమి’, 2012లో ‘తరతరాల తెలుగు సంస్కృతి, 2014లో సేవాయానం’. 2015లో ‘తెలుగు యువత’. 2016లో విశ్వనాథ సాహితీ విశ్వరూపం’. కథలు-గాధలు, 2017లో సినారె సాహిత్య వివేచన, 2019లో పాటల పూజారి వేటూరి సుందరరామమూర్తి శ్రీ భువన చంద్ర రచన, 2019లో “మహిళ, ఆంధ్ర రచయిత్రులు పరిచయ గ్రంధం, ప్రపంచ తెలుగు” మొదలైన విశిష్ట రంథాలను ప్రచురించింది.

చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు
2008లో మచిలీపట్టణం నుండి నెల్లూరు వరకూ గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లాల రచయితల సంఘాలతో కలిసి, తెలుగు భాష-సంస్కృత చైతన్యయాత్ర పేరుతో ప్రజల గుండె తలుపులు తట్టే కార్యక్రమాన్ని నిర్వహించింది. పశ్చిమగోదావరి జిల్లా రచయితల సంఘానికి తోడ్పడుతూ, ఆ జిల్లా వ్యాప్తంగా రచయితల పాదయాత్రకు సహకరించింది. 2008లో తెలుగు భాషకు ప్రాచీనతా హోదాను అడ్డుకొంటూ చెన్నై హైకోర్టులో వేసిన పిటీషనుని కొట్టివేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఆం.ప్ర. అధికారభాషాసంఘంతో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేసింది. 2008లో తెలుగు శాఖ లేకుండా కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నప్పుడు దానిని వ్యతిరేకిస్తూ పోరాటం చేసింది. విద్యార్థులు చేరటం లేదనే నెపాన్ని ఖండిస్తూ, కృష్ణాజిల్లా రచయితల సంఘం 8 మంది పేద విద్యార్థులకు రెండేళ్లకూ ఫీజులు చెల్లించి తెలుగు శాఖ ఏర్పడటంలో ముఖ్యపాత్ర వహించింది. తెలుగుశాఖ కోసం 6 బీరువాలు, 1500 సాహిత్య గ్రంథాలు బహూకరించింది.

2011లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో అగ్రిగోల్డ్ వారి సహకారంతో తెలుగుతల్లి విగ్రహాన్ని, వేటూరి సుందర రామ్మూర్తి, జాలాది రాజారావుగార్ల విగ్రహాలను నెలకొల్పింది. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో పుష్కర కాలంగా జరుగుతున్న శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలకు సహకారం అందిస్తూ వచ్చింది. శ్రీ శ్రీ శతజయంతి, తెలుగు కథ శతజయంతి. శ్రీకృష్ణదేవరాయ వైభవ మహోత్సవాలు, బెజవాడ గోపాలరెడ్డి శతజయంతి, విశ్వనాథ 125వ జయంతి, చిన్నయసూరి ద్విశతాబ్ది జయంతి, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంతి, కృష్ణాజిల్లా చిట్టూర్పులో సరసభారతి ఉయ్యూరు సహకారంతో పింగళి లక్ష్మీకాంతంగారి జయంతి నిర్వహించింది.

పురస్కారాల ప్రదానం
ప్రతియేటా కృష్ణాజిల్లా రచయితల సంఘం వివిధ సాహిత్య రంగాలలో కృషి చేసిన ప్రముఖులకు పురస్కారాలిచ్చి గౌరవిస్తోంది. శ్రీ మండలి బుద్ధప్రసాద్ నెలకొల్పిన “మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కారం”. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నెలకొల్పిన – శ్రీ ఆలూరి బైరాగి సాహితీ ప్రతిభా పురస్కారం”. శ్రీ గుత్తికొండ సుబ్బారావు నెలకొల్పిన “గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవా పురస్కారం” శ్రీ గోళ్ళనారాయణరావు నెలకొల్పిన “పోలవరపు కోటేశ్వర రావు కథా పురస్కారం”, అబార్య ముక్కామల ప్రతిభ నెలకొల్పిన ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారం, శ్రీ వేములపల్లి కేశవరావు నెలకొల్పిన అనువాద పురస్కారాలను గత పదేళ్లుగా ప్రదానం చేస్తోంది.

ఆచార్య కోరాడ మహదేవశాస్త్రి, డా. బాలాంత్రపు రజనీకాంత రావు, డా. వి వి కృష్ణశాస్త్రి. శ్రీ పి వి పరబ్రహ్మ శాస్త్రి. ఆచార్య పేరి భాస్కర రావు, శ్రీ గొల్లపూడి మారుతీరావు, ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య శలాక రఘునాధవర్మ, ఆచార్య ఎస్ గంగప్ప, ఆచార్య కోలవెన్ను మలయవాసిని, ఆచార్య ఎ. అదేశ్వర రావు, శ్రీ వంగపండు ప్రసాదరావు, డా. వెలగా వెంకటప్పయ్య, ఆచార్య మైనేని కృష్ణకుమారి, శ్రీ ఎ. కృష్ణారావు, కవి యాకూబ్, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ రసరాజు, శ్రీ ఆర్. ఎం. ఉమామహేశ్వర రావు, శ్రీమతి ఓల్గా, శ్రీ పోతుకూచి సాంబశివరావు, ఆచార్య వంగపల్లి విశ్వనాధం, డా. తుర్లపాటి రాజేశ్వరి, శ్రీ గూడ శ్రీరాములు, డా. రాధేయ, శ్రీ కె. ఎస్. నరసింహారావు, శ్రీ గోటేటి శ్రీరామారావు, శ్రీ కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి. శ్రీ దంటు సూర్యారావు. ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీ విహారి, శ్రీ మునిపల్లె రాజు, శ్రీమతి డి కామేశ్వరి, శ్రీ శ్రీరమణ, శ్రీ అట్టాడ అప్పల నాయుడు, శ్రీమతి పి సత్యవతి, శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల, శ్రీ జి. ఎస్. వరదాచార్యులు, శ్రీ జి. వి. రామారావు, శ్రీ పరకాల పట్టాభిరామారావు, శ్రీ సి. రాఘవాచారి, శ్రీ వీరాజ్, శ్రీ ఈడ్పుగంటి నాగేశ్వరరావు శ్రీ డోలేంద్ర ప్రసాద్, డా. కె. బి. లక్ష్మి, డాక్టర్ టి. సి. వసంత ప్రభృతులు కృష్ణాజిల్లా రచయితల సంఘం పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.

మా కార్యకర్తలు
గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు, ప్రధానకార్యదర్శి డా. జి. వి. పూర్ణచందు ఇంకా, శ్రీ విహారి, శ్రీ టి. శోభనాద్రి, శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, డా. గుమ్మా సాంబశివరావు, డా. వెన్నా వల్లభరావు, శ్రీ గోళ్ల నారాయణ రావు, శ్రీ విడియాల చక్రవర్తి శ్రీ భవిష్య, డా, గుడిసేవ విష్ణుప్రసాద్, శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి శ్రీమతి కరెడ్ల సుశీల, శ్రీమతి కోకా విమలకుమారి, డా. జి. రెజీనా, శ్రీమతి గుడిపూడి రాధికారాణి, డా. వై. శ్రీలత, డా. కొమాండూరు కృష్ణ, శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి, శ్రీమతి సిరిపురపు అన్నపూర్ణ, శ్రీ చింతపల్లి వెంకటనారాయణ, శ్రీ కళాసాగర్, శ్రీ శిఖా ఆకాష్, శ్రీ ఎస్. కె. డి.ప్రసాద రావు, శ్రీ రేపాక రఘునందన్, శ్రీ దామెర్ల నరసింహారావు. శ్రీ పంతుల వెంకటేశ్వరరావు శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ, శ్రీ సవరం వెంకటేశ్వర రావు, అజ్మీరు వీరభద్రయ్య, శ్రీ వేములపల్లి కేశవరావు ప్రభృతులు కార్యనిర్వాహకులుగా ఈ సంస్థను నడుపుతూ వస్తున్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రాణప్రదమైన కార్యకర్తలంతా సాహితీ రంగంలో ప్రసిద్ధులే! గ్రంథకర్తలుగా, రచయితలుగా, వక్తలుగా, నిర్వాహకులుగా సాహితీ లోకానికి చిరపరిచితులే!

Guttikonda Subbarao- GV Purnachand

కృష్ణాజిల్లా రచయితల సంఘం పేరుకు మాత్రమే జిల్లా రచయితల సంఘం గానీ, ప్రపంచ వ్యాప్తంగా 600 మంది జీవిత సభ్యుల్ని కలిగి, ఇంచుమించు ప్రతీ రచయితతోనూ సన్నిహిత సంబంధాలు నెరపుతున్న సంస్థ ఇది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో విశిష్ట కార్యక్రమాలెన్నో నిర్వహించి, తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి, పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

కృష్ణాజిల్లా రచయితల సంఘం తన 50 యేళ్ల పండుగను ఒక వేడుకగా మీ అందరి సమక్షంలోనూ జరుపుకోవాలని భావిస్తోంది. మీకు మా ఆహ్వానం! మీరాక మాకెంతో సంతోషం!!

గుత్తికొండ సుబ్బారావు, అధ్యకులు,
జివి పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి,

9 thoughts on “కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర

  1. కం ।। వృజనంబులపై బోరుచు…
    సృజనాత్మకముగ ప్రజలకు సేవలనిడగన్…
    త్రిజగన్మోహను డొసగును
    కృ.జి.రచ.సంఘమునకు చిర కీర్తిని ధృతిలోన్…. డాక్టర్ రాధశ్రీ

  2. ప్రపంచ రచయితల సంఘానికి పునాది,సాహిత్యాన్ని కృష్ణానది వొరవడిలా ప్రవహింపచేసిన..చైతన్య సాహితీ స్రవంతి,స్నేహానికి చిరునామా, ఆత్మీయతకు ఆతిథ్యానికి…పెన్నిధి,తెలుగు భాషా సంస్కృతుల కీర్తిని…ప్రపంచం నలుమూలల చాటి..ఒక పెద్ద సాహిత్య కుటుంబంగా రచయితలను..అందరినీ..ఒక వేదికగా..చేసి అత్యంత ఘన కీర్తిని సొంతం చేసుకుని,ఇపుడు..స్వర్ణోత్సవాల..ను..జరుపుకోబోతున్న కృష్ణాజిల్లా రచయితల సంఘానికి.. ఆ సంఘానికి…సారదులైన..శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి శ్రీ gv పూర్ణ చంద్ గారికి..గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి…ఇంకా ఎందరో ప్రముఖులైన వారి కార్యవర్గానికి..మా నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం)
    తరఫున…నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

  3. కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్న సంఘం వారికి నా అభినందనలు

  4. చాలా సంతోషం. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పెద్ద దిక్కైతే, శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీ వీ పూర్ణచంద్ గార్లు నిత్య కృషీవలురు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఈ నలుగురూ నాలుగు మూల స్తంభాలు.
    అద్భుతంగా నిర్వహించిన మీ సభల్లో చాలా సభలలో నేను పాల్గొనడం నా అదృష్టం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముందు జరిపిన సభలో వలే గొప్ప గా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సభలకు తప్పకుండా హాజరౌతాను.ఆత్మీయులు పూర్ణచందు గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
    శుభాకాంక్షలతో ….
    మీ శ్రీహరికోటి ,
    రాష్ట్ర అధ్యక్షుడు , అవార్డీ టీచర్స్ అసోసియేషన్-ఆంధ్రప్రదేశ్, 15-113 విద్యానగర్,సాయిబాబా గుడి వద్ద,ఏలూరు ,ప.గో.జిల్లా. 9441756213

  5. చాలా సంతోషం. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పెద్ద దిక్కైతే, శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీ వీ పూర్ణచంద్ గార్లు నిత్య కృషీవలురు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఈ నలుగురూ నాలుగు మూల స్తంభాలు.
    అద్భుతంగా నిర్వహించిన మీ సభల్లో చాలా సభలలో నేను పాల్గొనడం నా అదృష్టం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముందు జరిపిన సభలో వలే గొప్ప గా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సభలకు తప్పకుండా హాజరౌతాను.ఆత్మీయులు పూర్ణచందు గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
    శుభాకాంక్షలతో ….
    మీ శ్రీహరికోటి ,
    రాష్ట్ర అధ్యక్షుడు , అవార్డీ టీచర్స్ అసోసియేషన్-ఆంధ్రప్రదేశ్, 15-113 విద్యానగర్,సాయిబాబా గుడి వద్ద,ఏలూరు ,ప.గో.జిల్లా. 9441756213

  6. చాలా సంతోషంగా ఉంది కృష్ణ జిల్లా రచయితల సంగంలో జీవితసబ్యులుగా ఉన్నందుకు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించి తిరుగులేని బావుటా ఎగురవేశారు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ కార్యక్రమం నభుతోనాభావిష్యతిగా అలరారుతూ కృష్ణాజిల్లా రచయితల సంఘము ప్రాధాన్యతను సంతరించుకోవడం చాలా ఆనందంగా ఉంది.

  7. కృష్ణాజిల్లా రచయితల సంఘం యొక్క ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా బలంగా పడింది.
    ప్రపంచ తెలుగు మహాసభలుగా భావించేవారు , ఊహించేవారూ ఉన్నారు.
    తప్పు కాదు , అంత వైభవంగా ,గొప్పగా కార్యక్రమాల రూపకల్పన చేసి , అలా జరపడంలో ఇంతవరకూ కృతకృత్యులయ్యారు నిర్వాహకులు . ముందు ముందు ఇంకా బాగా జరిపిస్తారు కూడ.
    కవులు ,రచయితలు ,కళాకారులు ,దాతలు , సేవకులు సహితం ఆనందంగా పండుగ వాతావరణంలో ,హడావిడిగా తిరుగుతూ అలౌకిక ఆనందాన్ని ఆ రెండు , మూడు రోజులు పొంది , అరే !
    అప్పుడే జరిగిపోయిందా ? అని ఆశ్చర్యపోతున్నారు . అలా జరిగినపుడే ఆనందం. కార్యక్రమం విజయం . శుభం కలుగుగాక .
    పెద్దలందరికీ నమస్సులు .డా.జీ.వి.పూర్ణచంద్ గార్ ఎవరినీ మరువకుండా చక్కని నిర్వాహకులు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap