ఆధునిక నాగరికతకు, సంస్కృతికి అలవాటు పడిన నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆదర్శ మహిళా మణి…మేటి సాయి నిహారిక.. ఈనాటి యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచింది. పరమేశ్వరరావు నాగలక్ష్మిల గారాల పట్టిగా జన్మించిన నిహారిక తన ఎనిమిదవ యేట నుండి కూచిపూడి నాట్యం పట్ల ఆసక్తితో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయవాడ లో కూచిపూడి కి మకుటాయ మానంగా నిలిచిన గురువుగారు సింగారమని సీ.హెచ్. అజయ్ కుమార్ గారి వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తూ, ఎన్నో ప్రదర్శనలు చేస్తూ, కూచిపూడిలో డిప్లమో పూర్తి చేశారు. దూరదర్శన్ లో బి. గ్రేడ్ ఆర్టిస్ట్. గురువుగారి ఆశీర్వాద బలంతో సుమారు 1000 కి పైగా ప్రదర్శనలు పూర్తి చేసి అటు విద్యారంగంలోనూ బీ.టెక్. డిగ్రీ ని పూర్తి చేయగలిగింది. చదువు పూర్తి కాగానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తూ తనకు ఎంతగానో ఇష్టమైన నాట్య రంగంలో కూడా రాణిస్తూ గురువు గారి ఆధ్వర్యంలో పిల్లలకు శిక్షణ ఇస్తూ, హరిద్వార్ ఋషికేశ్ గంగోత్రి, కాశి, అరుణాచలం బద్రీనాథ్, శ్రీశైలం, కాళహస్తి, తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రదర్శన ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో కూడా భారతీయ ప్రతిభను ఇనుమడింప మతింపజేస్తూ, నాట్య ప్రదర్శనలు ఇచ్చింది.
2024 లో ఆర్మీ ఆఫీసర్ గా దేశానికి సేవ చేస్తున్న యోగేష్ కుమార్ గారిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత తనుకు ఇష్టమైన నాట్య రంగానికి దూరంకావాలేమో అనుకుంది. కానీ భర్త, అత్తమామల ప్రోత్సాహంతో తను ఎంతగానో ఇష్టపడిన నాట్య రంగంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ, ఇండిపెండెంట్గా ఉండాలని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, saree pre- pleating business, మేకప్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తు నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పీహెచ్డీ పూర్తి చేసి నాట్యకళను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని, భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు అందించాలని నేటి యువతకు మన సంస్కృతిని కళా వైభవాన్ని అందించాలని తన ఆశయం, తపన, అని పేర్కొంది.
-కౌండిన్య
