నందిని రెడ్డి కి ‘కె.వి.రెడ్డి’ అవార్డు

తెలుగు సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా రెండు దశాబ్దాలకు పైగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా లబ్ద ప్రతిష్టులైన దర్శకులకు ‘ జగదేక దర్శకుడు’ కె.వి.రెడ్డి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా యువకళావాహిని వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ YK నాగేశ్వరరావుగారి నిబద్దత.

ఆ క్రమం కొనసాగింపుగా ఈ సంవత్సరం సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావుగారి సారథ్యంలో, మా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మినారాయణగారి ఆధ్వర్యంలో మహిళా దర్శకురాలు బి.వి.నందిని రెడ్డిగారికి స్వర్గీయ కె.వి. రెడ్డిగారి అవార్డు మార్చి 7 న సారథి స్టూడియోలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వరప్రాద్ రెడ్డి, అశ్వనీ దత్, తమ్మారెడ్డి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

నందినీ రెడ్డి ‘అలా మొదలైంది’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యింది. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ రాజకీయాలలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. ఈమె విద్యార్థి దశలోనే నాటకాలలోను, వకృత్వంలోను, క్రికెట్ క్రీడలోను క్రియాశీలకంగా ఉండేది.

ఈమె గుణ్ణం గంగరాజు వద్ద దర్శక విభాగంలో లిటిల్ సోల్జర్స్ సినిమాకు తరువాత కృష్ణవంశీ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసింది.

2010 ‘అలా మొదలైంది’ సినిమాకు నంది ఉత్తమ నూతన దర్శకురాలుగా నంది పురస్కారం,
2011 ‘అలా మొదలైంది’ సినిమాకు హైదరాబాద్ టైమ్స్ ఫిలిం అవార్డ్స్ – ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్లు అందుకున్నారు.


-శ్రీధర్ అక్కినేని

SA: