స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి

మనుషుల మధ్య విబేధాలు వస్తే సమాజానికే ప్రమాదకరం అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరిశంకర్ అన్నారు. మనుషులకు మనసులకు మధ్య గోడలు బద్దలు కొట్టేందుకు కళాకారులు, సాహితీవేత్తలు కృషి చేయాలని కోరారు. మంగళవారం(23-08-22) రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కె.వి.ఎల్. ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి పేరిట వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నటులు అశోక్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధులను, సంస్కృతి సంప్రదాయాలను రానున్న తరం గుర్తుంచుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ఓటిటి ఛానెల్ ఏర్పాటు చేస్తే కళాకారులందరం బాధ్యతగా సేవలు అందిస్తామని ప్రకటించారు.

SivaParvathi

సీనియర్ సినీ నటులు శ్రీమతి శివపార్వతి, శ్రీ అశోక్ కుమార్, శ్రీ గౌతమ్ రాజు, సేవా మూర్తులు శ్రీమతి సరోజినీ మాటూరు, శ్రీ గట్టు శంకర్ లను స్ఫూర్తి ప్రదాత పురస్కారాలతో సత్కరించారు. ఈ వేడుకలో డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ ఎన్. పురుషోత్తం, శ్రీ దైవజ్ఞ శర్మ, శ్రీ కథక్ అంజుబాబు, శ్రీమతి అఖిల తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీమతి పారిజాత నేత్రుత్వంలో అఖిల, సుజాత, ఇందునయన, శ్రీ పసుల లక్ష్మణ్ తదితర 20 మంది గాయకులు సినీ దేశభక్తి గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. శ్రీమతి రోహిణి కందాల శిష్యులు కూచిపూడి, పండిట్ అంజుబాబు శిష్యులు కథక్, శ్రీ హరి మంగళంపల్లి బృందం కూచిపూడి నృత్యాలతో దేశభక్తి ఉప్పొంగించారు.

  • డా. మహ్మద్ రఫీ
    ఫోటోలు : కంచె శ్రీనివాస్
SA: