తొలితరం నటీమణి – లక్ష్మిరాజ్యం

బాలసాహివేత్త, బహుముఖ గ్రంథ కర్త డా. బెల్లంకొడ నాగేశ్వరరావు నిర్యహిస్తున్న ఫీచర్ ‘వేదిక నుండి వెండి తెరకు’. ఇందులో నాటకరంగం నుండి సినిమాకు వచ్చిన అలనాటి నటీ-నటులను మనకు పరిచయం చేస్తారు.

లక్ష్మీరాజ్యం కర్నూలు జిల్లా అవుకు అనే ఊరికి చెందినవారు.ఆమె మేనమామ సంగీతకళాకారుడు కావడంతో తనూ బాల్యంనుండి సంగీతంపై మక్కువ పెంచుకుని సంగీతంలో ప్రావీణ్యం పొంది హరికథలు చెప్పడం నేర్చింది.
మరో దగ్గర బంధువు వెంకటరామయ్య అని ఉండేవాడు ఆయనకు నాటకాలు అంటే ప్రాణం. ఆ పరిసరాల్లో ఎక్కడ నాటకలు జరిగినా తనతోపాటు రాజ్యాన్ని తీసుకు వెళుతుండేవాడు. అలానాటకరంగంపై ఆమె మక్కువ ఏర్పరుచుకుంది. అదిగమనించిన వెంకట్రామయ్య రాజ్యాన్ని ప్రముఖ రంగస్ధలనటుడు పువ్వులసూరిబాబు గారివద్దకు తీసుకువెళ్ళి ఈమెకు శిక్షణ ఇవ్వమన్నాడు.

అలానాటకరంగ ప్రవేశం జరిగింది. కాక వెంకట్రామయ్య గారు రాజ్యాం గారిని కలకత్తా గ్రామ్ ఫోన్ రికార్డింగ్ కంపెనీకు తీసుకువెళ్ళి జానపదపాటలు,పద్యాలు పలురికార్డులు ఇప్పించారు. అవి నాడు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.రాజ్యం నాటకరంగంలో బిజీగా ఉన్న రోజుల్లో కాళీ ఫిలింస్ కలకత్త వారు ‘శ్రీకృష్ణతులాభారం'(1935) చిత్రంలో (నళిని)పాత్రలో లక్ష్మిరాజ్యం తొలిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే చిత్రంలో ‘రేలంగి'(వసుదేవుడు) ‘రుష్యేంద్రమణి'(సత్యభామ), ‘కాంచనమాల’ (మిత్రవింద) గా పరిచయంచేయబడ్డారు. రుష్యేంద్రమణి ఈ చిత్రంలో తొలిసారి నటిస్తున్నప్పటికి వేయిరూపాయల పారితోషకం తీసుసుకున్నారు. రేలంగికి డెబ్బయ్ ఐదురూపాయల పారితోషకం ఇచ్చారు. ఇంకా కృష్ణుడిగా ఎస్.జయసింగ్, నారదుడిగా కపిలవాయి రామనాధశాస్త్రి, వసంతకుడిగా గండికోటజోగినాధం నటించారు.అనంతరం ‘కృష్ణలీలల రాధ పాత్రలో నటించారు.ఇంకా ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య కంసుడిగా, మాస్టర్ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారు బాలకృష్ణుడుగా తొలిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. బకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గీతం ఈచిత్రలో వాడుకున్నారు. విజయవాడలో తొలి ధియేటర్ ‘మారుతి సినిమా’లో 1935/6/1 వ తేదిన విడుదలజరిగింది.

అనంతరం’శశిరేఖాపరిణయం ‘(1936) చిత్రంలో సత్యభామగా లక్ష్మీరాజ్యం, శశిరేఖగా వెల్లాల సుబ్బమ్మ అను నటీమణిని ‘శాంతకుమారి’ పేరున పరిచయం చేయబడ్డారు.అలా (1939)లో వచ్చిన’అమ్మ’ ద్వీతీయ కథానాయకిగా, ‘అపవాదు’ (1942) ‘పంతులమ్మ'(1947) ‘నాదనారది’ (1946) ‘ద్రోహి'(1948) ‘అగ్నిపరిక్ష'(1951) ‘దాసి'(1952) ‘రాజుపేద’ (1954)’శ్రీకృష్ణలీలలు'(1959)  ‘హరిశ్చంద్ర'(1956) ‘ముద్దుబిడ్డ'(1956) ‘నర్తనశాల'(1963)’గోవుల గోపన్న'(1965) ‘రంగగేళిరాజా'(1971) ‘తదితర చిత్రాలలో నటించారు.
1951 నుండి ఈమె తన భర్త కె.శ్రీధరరావు తో కలసి ‘రాజ్యం పిక్చెర్స్’స్ధాపించి ‘కృష్ణలీలలు’ ‘దాసి’ ‘హరిశ్ఛంద్ర’ ‘నర్తనశాల’ ‘శకుంతల’ ‘గోవుల గోపన్న’ ‘రంగేళి రాజా’ ‘మగాడు’ వంటి చిత్రాలు నిర్మించారు.
చలనచిత్రసీమకు ఎనలేని కళాసేవలు అందించిన ఈమె తన అరవై అయివ ఏట 1987 శాశ్విత నిద్రలో ఒరిగిపోయారు.
డా. బెల్లంకేండనాగేశ్వరరావు (9884429899)

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap