కేంద్ర లలిత కళా అకాడెమీ లో ప్రాతినిధ్యం  లేని ఏ.పి. ?

కేంద్ర ప్రభుత్వం 1956  లో  స్థాపించబడ్డ  లలిత కళా అకాడెమీ లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం కల్పించేలా రాష్ట్ర  సాంస్కృతిక శాఖ  తక్షణం చర్యలు  తీసుకోవాలి. అకాడెమీ మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఒక్కొక్క రాష్ట్రం నుండి ఒక్కో కళాకారునికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు శిల్ప, చిత్రకారుల్ని సిపార్సు చేయాల్సి ఉంటుంది. అందులో ఒకరికి  కేంద్ర లలిత కళా అకాడెమీ సభ్యత్వం కల్పిస్తుంది. ఆలా ఎంపికైన సభ్యుడు  రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు.  అకాడెమీ నిర్వహించే కార్యక్రమాల్లో మూడేళ్ళ పాటు భాగస్వాములవుతారు. కేంద్ర లలిత కళా అకాడెమీ కి సభ్యులుగా నామినేట్ అయిన వ్యక్తి మరో ఇద్దరు సభ్యులను ఎన్నుకునే అవకాశం వుంది.

గత ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు నామినేషన్లు పంపాలని కేంద్ర లలిత కళా అకాడెమీ  సర్కులర్ పంపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేశాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణ లో చిత్రకారుడు శ్రీ రమణ  రెడ్డి  అకాడెమీ సభ్యులుగా పదవీ భాద్యతలు కూడా స్వీకరించారు.

కాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రతిపాదన  అకాడెమీ కి పంపకపోవడం వల్ల రాష్ట్రానికి చెందిన చిత్రకారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు అకాడెమీలను ఎలాగూ పునరుద్దరించ లేదు. కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా లేదు. దీని  వల్ల రాష్ట్రం లో  ఈ రంగానికి చెందిన సుమారు 500 మంది కళాకారులు ఎలాంటి గుర్తింపు, ప్రోత్సహం లేక వేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్రకారులు, శిల్పులు, చిత్ర కళా సంస్థలు రాష్ట్రం లోని అకాడెమీల పునరుద్ధరణ, అదేవిధంగా కేంద్ర లలిత కళా అకాడెమీ కి తక్షణం రాష్ట్రం నుండి నామినేషన్ పంపాలని ప్రభుత్వం పైన, ముఖ్యంగా సాంస్కృతిక శాఖ పైన లేఖల ద్వారా వత్తిడి తేవాలి. లేక పొతే మన రాష్ట్రంలో అసలు చిత్ర, శిల్ప కారుల ఉనికే ప్రశ్నర్ధాకం అవుతుంది.

-సుంకర చలపతిరావు (91546 88223)
చిత్ర కళాపరిషత్, విశాఖపట్నం

_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

2 thoughts on “కేంద్ర లలిత కళా అకాడెమీ లో ప్రాతినిధ్యం  లేని ఏ.పి. ?

  1. మన ప్రభుత్వ ఇలాంటి విషయాల పై సత్వరం స్పందించాలి. ఎందుకంటే మనం తెలంగాణ తో వేరు పడ్డాక కళారంగంలో వెనుక బడ్డమేమో నన్న అభిప్రాయం ప్రతీ వారిలోనూ కలుగుతుంది. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొటున్నాం. కాబట్టి వున్న, వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి. అప్పుడే మనం ప్రగతి సాధించగలం. ఇలాంటి విషయాలలో ప్రభుత్వ అధికారులకు కూడా అలసత్వం పనికిరాదు.
    జింకా రామారావు
    సీనియర్ చిత్రకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap