*చేనేతను, హస్తకళలను, సంస్కృతిని కాపాడేందుకు విశేష కృషి
*సూపర్ జీఎస్టీతో చేనేత రంగంలో కొత్త ఉత్తేజం
*ఉత్పత్తి దారులచే నేరుగా తక్కువ ధరలకు అమ్మకాలు
*ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత
కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో అఖిల భారత వాస్తకళా వస్తువులు, కళాత్మక వస్త్ర ప్రదర్శన, అమ్మకం వేదిక గాంధీ శిల్ప బజార్ ను శుక్రవారం ( అక్టోబర్ 10) రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, లేపాక్షి చైర్మన్ డా. పి. హరిప్రసాద్, ఎం.డీ. ఎం. విశ్వ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత దూట్లాడుతూ దేశ వ్యాప్తంగా హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించేలా ఈ నెల 10 వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా దేనేత, హస్తకళాకారుల ద్వారా పాటు అన్ని పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీతో రంగాల్లోనూ అభివృద్ధికి వీలుంటుందని… జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందరికీ చేరువయ్యేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని.. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించిన ఒక జిల్లా, ఒక ఉత్పత్తి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు లభించాయని, చీరాల పట్టు చీరలు, వెంకటగిరి కాటన్ చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం రేస్ అల్లికలు వంటివాటికి అవార్డులు లభించాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా లేపాక్షి చైర్మన్ డా. పి. హరిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రంలో చేనేత, హస్తక కాకారుల ఉత్పత్తులను పెద్దఎత్తున ప్రోత్సహించడం జరుగుతోందని.. గాంధీ శిల్ప బజార్లో కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలు శిల్ప బజారు సందర్శించి, కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. కళలు, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లేపాక్షి వీసీ, ఎండీ ఎం. విశ్వ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కమిషన్ సహకారంతో నిర్వహిస్తున్న గాంధీ శిబ్బ బజార్లో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, గద్వాల్, సిద్ధిపేట్, నారాయణపేట్, చీరాల, కలంకారి, వాటిక్ ప్రింటింగ్, బెంగాలి కాటన్, కాశ్మీరి సిల్క్ కోసా సిల్క్ మధురై, లక్నో, చికన్ వర్క్ నారాయణవరం, గాగ్రా, దోళ్లి, కాటన్, ప్రింటెడ్, సంబల్పూర్, కోసా (టస్చర్), అప్లిక్ వర్క్ ప్యాచ్ వర్క్, ఖాదీ మెటీరియల్, బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. హస్తకళా వస్తువులను, చేనేతలను కొనుగోలు చేసి, కళాకారులకు చేయూతనివ్వాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాంధీ శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ హ్యాండీకార్డ్స్ డెవలప్మెంట్ కమిషన్ ఏ.డీ. అవరా లక్ష్మీ, లేపాక్షి మేనేజర్ ఎం. సురేష్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.
-కళాసాగర్
