నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’
ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 45 రోజుల పాటు గ్రంధాలయానికి వచ్చి, డ్రాయింగ్ నేర్చుకొని, కథలు పుస్తకాలు చదవడం, పాటలు, డాన్స్ నేర్చుకున్నదుకు పిల్లలను అభినందించారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిన టీచర్లను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు గ్రంధాలయనికి ఖాళీగా సమయాలలో వచ్చి పుస్తకాలు చదువుకోవాల్సిసిందిగా చైర్మన్ గారు కోరారు.
సభ అనంతరం ‘వేసవి విజ్ఞాన శిబిరం’లో పాల్గొన్న విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్, మెమెంటో, పుస్తకాలు గిఫ్టులుగా అతిథిలు చేతులు మీదుగా అందించారు. టీచర్లను చైర్మన్ గారు దుశ్శాలువాలతోను, మెమెంటోతోను సత్కరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ ఇలాంటి వేసవి శిక్షణా శిబిరాలు పిల్లలలో నున్న అంతర్గత కళలను వెలితీస్తాయన్నారు. ఇలాంటి అవకాశం కల్పించిన గ్రంథాలయ సంస్థను, అధికారులను అభినందించారు. ఈ సభలో ఇంకా డ్రాయింగ్ టీచర్ మల్లిక్, డాన్స్ మాస్టర్ శ్రీమన్నారాయణ, కరాటే మాస్టర్ రవిబాబు, జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు, గాయకుడు బొడ్డపాటి దాసు, రచయితలు రాణి, శివనాగేశ్వరి, కె.మధుసూధన రాజు, ఎ.రామచంద్రుడు, డి.రమేష్, సి.హెచ్ రామకృష్ణ తదితర గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.