సాహిత్య పురస్కారం-నవలలకు ఆహ్వానం

ఆచార్య ‘వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2024’ కై నవలల ఆహ్వానం

అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు ‘ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం’ ప్రదానం చేయుట మీకు తెలిసిందే. 2024 సంవత్సరంకు గాను నవల లకు ప్రదానం చేయుటకు నిర్ణయించనైనది. కావున నవలలను ఆహ్వానిస్తున్నాం.

నిబంధనలు:
1) 2020 జూలై నుండి 2024 జూన్ వరకు ప్రచురించినవై ఉండాలి.
2) మెుదటి ముద్రణలు మాత్రమే పంపాలి.
3) నాలుగు (4 copies) ప్రతులు పంపాలి.
4) ప్రతులు చేరవలసిన చివరి తేది 31 ఆగస్టు 2024.
5) అన్ని ప్రాంతాల వారు పంపవచ్చును.
6) ఎంపికైన గ్రంథకర్తకు అక్టోబర్ 2024లో హనుమకొండలో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో రూ. 5000/- నగదు, శాలువ, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం చేయబడును.
7) పుస్తకాలు పంపవలసిన చిరునామా:
నిధి, ఇంటి నెంబర్ : 2-4-1449, అశోక కాలని, హనమకొండ-506001 (తెలంగాణ)
పోన్, 97010 00306
రచయితలు సకాలంలో వారి నవలలు పంపవలసినదిగా ‘అరసం’ వరంగల్ అధ్యక్షులు నిధి, ప్రధాన కార్యదర్శి డా. పల్లేరు వీరస్వామి గారలు ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap