
“పలమనేరులో జూన్ 29న సాహిత్య సభ” కు ఆత్మీయ ఆహ్వానం
చిత్తూరు జిల్లా సీనియర్ సాహితీవేత్త కీ.శే. సి. వేణు గారి గురించి డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారిచే స్మారక ఉపన్యాసం, పలమనేరు బాలాజీ రెండు పుస్తకాలు: గీతాంజలి స్మారక పురస్కారం, సడ్లపల్లె కథా పురస్కారాం పొందిన “ఏకలవ్య కాలనీ” ఎరుకల జీవన గాథలు” కథా సంపుటి, “లోపలేదో కదులుతున్నట్టు” కవితా సంపుటి పరిచయ కార్యక్రమం చిత్తూరు జిల్లా పలమనేరు, లయన్స్ క్లబ్ లో జూన్ 29 వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత రచయితలు, కవుల ఇష్టాగోష్టి.
స్వచ్ఛత ప్రచురణలు బెంగళూరు పక్షాన సి. భానుమూర్తి రెడ్డి, సాహితీవేత్తలు శ్రీయుతులు ఎన్. వేణుగోపాల్, ఆర్.ఎం.ఉమామహేశ్వర రావు, వి. ప్రతిమ, భూమన్, సుంకోజి దేవేంద్రాచారి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, వంగాల సంపత్ రెడ్డి, పల్లిపట్టు నాగరాజు, ఎండపల్లి భారతి, టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి తదితరులు పాల్గొంటారు. సాహితీ మిత్రులు, సాహిత్యాభిమానులందరూ పాల్గొనవలసిందిగా సాదర ఆహ్వానం.
వివరాలకు: పలమనేరు బాలాజి, (9440995010)