ఆన్ లైన్ లో పుస్తకాలు కొనాలా ?

‘లోగిలి’ ఓ తెలుగు పుస్తక ప్రపంచం …

పుస్తకాల షాపులనేవి గొప్ప ఆలోచనల్ని సంరక్షించే ‘కోల్డ్ స్టోరేజ్ ‘ లాంటివి. అయితే నేటి యాంత్రిక జీవితంలో పుస్తకాల షాపుకెళ్ళి పుస్తకాలు కొనుక్కొనే సమయం లేక వాయిదా వేస్తుంటాం. అంతర్జాల ఆవిర్భావంతో అన్ని రంగాల్లోనూ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకొచ్చాయి. మన ఇంటి నుండే మనకు కావాల్సిన పుస్తకాలను తెప్పించుకొనే సదుపాయం కల్పిస్తున్నారు గుంటూర్ కు చెందిన లోగిలి.కాం వారు. ఆరేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ లోగిలి ఆన్ లైన్ షాప్ లో ప్రస్తుతం కథ, కవిత, ఆరోగ్యం, నవలలు, ఆధ్యాత్మికం, పిక్షన్, సినిమాలకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 7000 రకాల పుస్తకాలు అందుబాటులోవున్నాయి. ఇండియా లో ఎక్కడికైనా డెలివరి చేస్తున్నారు.

రచయితల నుండి పుస్తక సేకరణ
ఔత్సాహిక రచయితలు తమ రచనలకు పుస్తక రూపం ఇచ్చి అమ్మకాల కోసం వెతుకుతున్నప్పుడు వారికి అండగా నిలిచి వేదిక లోగిలి. లోగిలి ఎప్పుడు అధిక సంఖ్యలో కాపీలను రచయితల నుండి తీసుకోదు. ముందుగా వారి నుండి 12 కాపీలను మాత్రమే తీసుకుంటుంది. వాటి ప్రమోషన్ కు ఫేస్బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లను సాధనాలుగా మలుచుకొని వాటిని ప్రజల్లోకి తీసుకు వెళుతుంది. ఆ పుస్తకాన్ని పుస్తక ప్రేమికులకు చేరువ చేయడానికి తన వంతు కృషిని అందిస్తుంది.

పుస్తకాలు కొనేవారికే కాకుండా, తమ పుస్తకాలు అమ్మాలనుకునే రచయితలకు మంచి వేదిక లోగిలి. మరిన్ని వివరాలకు 9550146514 నంబర్ ను సంప్రదించండి.

http://www.logili.com/

1 thought on “ఆన్ లైన్ లో పుస్తకాలు కొనాలా ?

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link