హైదరాబాద్లో ‘లోర్వెన్ AI’ స్టూడియో

‘దిల్’ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియో లోగో ను ప్రారంభించిన అల్లు అరవింద్

మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుక హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది.

“AI గురించి గత రెండేళ్లుగా డిస్కషన్ స్టార్ట్ చేశాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటం తో కలసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. 360 డిగ్రీస్ సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్ గా డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్టు ఐడియా నుంచి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేవరకు ఒక స్టేజ్. న్యూ కమ్మర్స్ కి ఇది చాలా యూజ్ ఫుల్ గా ఉంటుందని డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్ గా ప్రీ ప్రొడక్షన్ గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో సినిమా వాళ్ళకి తెలుసు. సెకండ్ స్టేజ్ ప్రీ ప్రొడక్షన్. తర్వాత షూటింగ్ ప్రాసెస్, పోస్ట్ ప్రొడక్షన్. తర్వాత ప్రమోషన్స్. ఇలా స్టెప్ బై స్టెప్ గా డెవలప్ డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత చేసే ప్రీ ప్రొడక్షన్ ని AI లో ఎలా చేయొచ్చు అనేది చేయడం జరిగింది. అది చాలా మిరాకిల్ గా అనిపిస్తుంది. చాలామంది డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి దీని గురించి చూపించడం జరిగింది. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అప్రిషియేషన్ ఒక ఎనర్జీని ఇచ్చింది. స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ లో మనం హోమ్ థియేటర్ లో విత్ సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా చూడొచ్చు. అది మెయిన్ టార్గెట్. పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ ఏది అనుకుని సినిమాని తీశాడు ఫైనల్ కట్ సినిమా చూడొచ్చు. ఈ విషయంలో ముఖ్యంగా మూడు టార్గెట్స్ ఉన్నాయి. సక్సెస్ పర్సెంటేజ్ ని పెంచవచ్చు. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో డైరెక్టర్ కి టైం సేవ్ అవుతుంది. టైమ్ సేవ్ అవ్వడం వల్ల దర్శకులు ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తారు. అలాగే ప్రొడ్యూసర్స్ కి టైం సేవ్ కావడం వల్ల మనీ సేవ్ అవుతుంది. ‘లోర్వెన్ AI’ అనేది ఎమోషన్ లేని ఒక ఫస్ట్ ఏడి గా భావించవచ్చు. ఇది డైరెక్టర్స్ కి క్రియేటివ్ సైట్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. మా సంస్థలో రూపొందుతున్న విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన సినిమా తీస్తున్న డైరెక్టర్ రవికిరణ్ ఇందులో వర్క్ చేస్తున్నాడు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షను ఇందులోనే జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళతో చేస్తున్న తెల్ల కాగితం అనే సినిమా కూడా జరుగుతుంది. అలాగే ఒక విఎఫ్ఎక్స్ సినిమా చేయబోతున్నాం. దాని వర్క్ కూడా ఇందులోనే జరుగుతుంది. అలాగే ఒక స్క్రిప్ట్ ని కూడా ఇందులోనే డెవలప్ చేస్తున్నాం. దీన్ని అందరికీ ఉపయోగపడేలా డెవలప్ చేస్తున్నాం. ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం. మా కంపెనీ కాకుండా మిగతా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ ‘లోర్వెన్ AI’ కావాలనుకుంటే సంప్రదించొచ్చు.” అన్నారు ‘దిల్’ రాజు.

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… “దిల్ రాజు గారు మా అందరికీ షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా AI ని అడాప్ట్ చేసుకున్నారు. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటివి చాలా యూజ్ ఫుల్ గా ఉంటాయి. ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. దిల్ రాజు గారికి అభినందనలు’అన్నారు”.

ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బాబీ, నాగ్ అశ్విన్, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు, డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కేఎల్ దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, ఇంద్రగంటి మోహన కృష్ణ, వేణు తదితరలు పాల్గొన్నారు.

-కళాసాగర్ యల్లపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap