లూయిస్ బ్రెయిలీ 203 వ జయంతి

జీవితంలో సంభయించే అంధత్వం, అంగవైకల్యం ఎదుగుదలకు అవరోధాలు కాదు అని నిరూపించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. అంధులైన దివ్యాంగులకు లిపిని కనిపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అంధులకు జ్ఞానదృష్టిని ప్రసాదించిన లూయిస్ బ్రెయిలీ ది జనవరి 4, 1809 లో ఫ్రాన్సులో సాధారణ కుటుంబంలో జన్నించారు. పుట్టుకతో ఏ అవయవ లోపం లేదు. తలిదండ్రులు గుర్రాలు జీనులు తయారుచేసి జీవనం సాగించేవారు. మూడేళ్ళ వయస్సులో తన తండ్రి జీనుల దుకాణంలో పనిముట్లతో ఆడుకొనుచుండగా ప్రమాదవశాత్తు ఒక పనిముట్టు అతని కుడి కంటిలో పడింది. నాడు వైద్యసదుపాయాలు లేనందున కుడికన్నుకుతగిలిన గాయం పెద్దదై ఇన్ ఫెక్షన్ రెండో కంటికి కూడా సోకి పూర్తి అంధత్వం ప్రాప్తించింది. కాని పట్టువదలని ఆత్మవిశ్వాసంతో మంచి ఆర్గానిస్ట్ సంగీత విద్వాంసుడు, గొప్ప విద్యావేత్తగా చరిత్రలో నిలచారు. 1826నుండి ఫారిస్ లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ చిల్డ్రన్ కు బోధించారు.

పాఠశాలలో ఛార్లెస్ బార్బియర్ ప్రదర్శించిన రచనావిధానంపైాఆసక్తి కనబరిచాడు. దీనీలో ఫొనెటిక్ ధ్వనులను సూచించే చుక్కలతో కూడిన సందేశం కార్డుబోర్డుపై చిత్రీకరించబడింది. బ్రెయిలీ 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఒక సాధారణ పరికరంతో వ్రాసిన ఒక అనుసరణను రూపొందించాడు. అది చూపులేని వారి అవసరాలను తీర్చింది. ఆ వ్యవస్థపై విస్తృత పరిశోధనల అనంతరం వివిధ కలయికలలో 6 చుక్కల కోడ్ ను ఆవిష్కరించాడు. దానిని సంగీత సంజ్ఞామానానికి అనుకూలంగా మార్చాడు. 1829లో తను రూపొందించిన టైప్ సిస్టమ్ పై గ్రంథాన్ని ప్రచురించాడు. 1837లో ప్రసిద్థ చరిత్ర పాఠశాల పుస్తకం యొక్క మూడు వాల్యూమ్ ల బ్రెయిలీ ఎడిషన్ ప్రచురించాడు. దీనితో బ్రెయిలీ కనిపెట్టిన లిపి అంధులకు జీవనవరమైంది. ప్రాప్తించిన అంధత్వానికి కృంగిపోక మొక్కవోని ధైర్యంతో అసమాన ప్రతిభావంతుడై తన తోటి వారి జీవితాలలో వెలుగు నింపిన లూయిస్ బ్రెయిలీ ది 06-01-1852 లో 41ఏళ్ళ ప్రాయంలో క్షయవ్యాధితో మరణించారు. జీవులు పుట్టుక, మరణం సహజం. ఎంతకాలం జీవించాము అనే దానికంటే మన సమాజానికి ఏమి చేశాము అనేది ముఖ్యం. అనేక మంది మహనీయుల జీవితచరిత్రలు గమనిస్తే వారెవరు భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించలేదు. వారు నిత్య కష్టాలలో కూడా చలించకుండా సమాజహితం కోరి సమాజ సేవ చేశారు. అలాంటి వారిలో లూయిస్ బ్రెయిస్ అంధుల లిపి రూపకర్త అగ్రగణ్యులు. నేడు అంధులు బ్రెయిలీ లిపిలో ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు చేరడంలో బ్రెయిలీ పాత్ర మరువలేనిది. లూయిస్ బ్రెయిలీ చూపిన మార్గం సదా అనుసరణీయం.

నాకు బ్రెయిలీ లిపి రాదు. కాని నేను 2005నుండి 2018 వరకు పనిచేసిన విజయవాడ, సుర్యారావు పెటలోని శ్రీకర్నాటి రామ్మోహనరావు నగర పాలక సంస్థ పాఠశాల అంధుల సహ పాఠశాల. ఆ పాఠశాలలో సాధారణ విద్యార్థులతో పాటు అంధులు కూడా చదువుకునేవారు. వారు మేము చెప్పేది విని టేప్ రికార్డర్లు, రీడర్లద్వారా వినేవారు. పరీక్షలలో వారికి స్క్రబర్ (వ్రాయువారిని)పెట్టుకొని పరీక్ష వ్రాసే పద్థతిని ప్రభుత్వం కల్పించింది. ప్రాథమిక స్థాయిలో శ్రీమతి వనజ గారు వారికి బ్రెయిలి లిపి నేర్పి 1 నుండి 10 వరకు వారి చదువు సాజవుగా సాగడానికి సహకరించేవారు. కాలక్రమంలో అనేక సదుపాయాఅ గల పాఠశాలలు ఆవిర్భయించిన తరుణంలో అంధబాలల సహపాఠశాల ప్రాముఖ్యతకోల్పోయింది. కాని ప్రతి సంవత్సరం జనవరి4న బ్రెయిలీ జయంతి సందర్భంగా పాతవిద్యార్థులు ఫోన్ ద్వారా పలుకరించుట మధురానుభూతి.

లూయిస్ బ్రెయిల్ జయంతి ఘన నివాళులు

అప్పారావు మూకల

SA: