ఎందరికో దృష్టి ప్రసాదించిన దివ్యదర్శి

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 20

పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించి భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాఫాల్కే అవార్డును అందుకొనే వరకు ఎదిగిన తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, వదాన్యుడు ఎల్.వి. ప్రసాద్. భారతదేశపు తొలి టాకీ సినిమా ఆలంఆరాలో ఓ చిన్న వేషం వేసిన ఈయన తదుపరి తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసు. తొలి తెలుగు టాకీ భక్తప్రహ్లాద సినిమాల్లో నటించాడు. రాజ్ కపూర్ ని హీరోగా శారద అనే సినిమాకు దర్శకత్వం వహించి, తొలి హిందీ సినిమాతో చరిత్ర సృష్టించాడు. 1956 లో ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థను, ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్బ ను మద్రాలో స్థాపించాడు. ఈయన స్థాపించిన లాబోరేటరీలు, కార్యాలయాలు భారతదేశంలోనే కాక సింగపూర్, హాలీవుడ్ లలో నేటికీ ఎంతో పేరు ప్రఖ్యాతులతో నడుస్తున్నాయి. ఈయన గురించి ప్రముఖంగా చెప్పుకోవలసినది ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఒకటి. అందరికీ మంచి కంటిచూపు అందించాలనే మంచి ఆలోచనలతో హైదరాబాద్ నగరంలో కొన్ని ఎకరాల భూమిని దానం చేసి, ఎందరికో కంటి చూపు ప్రసాదించాడు. దాదాఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులతో సహా సినీ రంగానికి సంబంధించినంతవరకూ ఈయన అందుకోని అవార్డు లేదు. ఈ సినీ కళామతల్లి వరపుత్రుడు ఎల్.వి. ప్రసాద్. నేటికీ మన ధృవతార !

(ఎల్.వి. ప్రసాద్ జన్మదినం 17 జనవరి 1908)

SA:

View Comments (1)