శ్రీశ్రీ తర్వాత వేటూరి

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమా పాటకు సరికొత్త సొగసులద్దిన వేటూరి  85వ జయంతి సందర్భంగా….

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకతం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత కొన్ని వేల పాటలను రాశాడు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాశారు. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.

జీవిత విశేషాలు:
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు… మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్రప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.

సినీ ప్రస్థానం:
కె.విశ్వనాథ్ దర్శకతం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్ని స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని పురాణ సాహితం్యలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముతం…. ఇలా ఎన్నో సినిమాలు…. ఈ సినిమాలలోని అందమయిన అద్భుతమయిన పాటలు! ” పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పదించునవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులేమృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవితం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండిపామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా ఘోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసినమాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చుతునక.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు.

-రవివర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap