నేడు ప్రజాకవి వంగపండు వర్ధంతి

నేడు విశాఖలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ ఉడా చిల్డ్రన్స్ థియేటర్, వేదిక నందు ఉ.గం.9 :00 లకు 4 ఆగస్టు 2021 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష నేతృత్వంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారు వర్ధంతి కార్యక్రమంతో పాటు కీ.శే. వంగపండు ప్రసాదరావు విగ్రహమును బీచ్ రోడ్డు నందు ప్రతిష్టించుటకు, ప్రతి సంవత్సరము వారి వర్ధంతి కార్యక్రమము రోజున 2 లక్షల రూపాయల వంగపండు ప్రసాదరావు జానపద కళా పురస్కారాన్ని ఒక ప్రముఖ జానపద కళాకారునికి ప్రదానం చేయవలసిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగిరిజన సంక్షేమ శాఖామాత్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణ దాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖామాత్యులు తానేటి వనిత, పశుసంవర్ధక, మత్స్య సంపద పాడి అభివృద్ధి శాఖామాత్యులు సీదిరి అప్పలరాజు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ప్రముఖ కవి గుమ్మడి విట్టల్ రావు (గద్దర్ ), ప్రముఖ కవి, గేయ రచయిత గోరేటి వెంకన్న, రచయిత, గాయకులు, స్వరకర్త, నటులు మరియు దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి, ప్రముఖ జానపద గాయని శ్రీమతి అరుణోదయ విమల, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ ఇతర అధికార యంత్రాంగం పాల్గొంటారు .

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link