‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి

‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి
మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలనీ, ముఖ్యంగా ‘మా’ మెంబర్స్ అయ్యుండి అవకాశాలు లేని ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరుతూ 19-8-19 న ఉదయం 10 గంటలకు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తరఫున ప్రెసిడెంట్ డా. వి.కె.నరేష్, జనరల్ సెక్రటరీ శ్రీమతి జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ హేమ, అలీ, రాజా రవీంధ్ర, ఉత్తేజ్, సురేష్ కొండేటి, అనితా చౌదరి, జయలక్ష్మీ, అశోక్ కూమార్, టార్జాన్ తదితరులు కలిసి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ . సుప్రియ గారిని, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ గారిని, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ గారిని, తెలుగు చలన చిత్ర . రచయితల సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణ గారిని, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అధ్యక్షులు అమ్మిరాజు గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా మా అధ్యక్షులు నరేష్ గారు మాట్లాడుతూ.. మా సభ్యులుగా ఉన్న చాలా మంది వేషాలు లేక బాధపడుతున్నారని వారి కోసం మేమందరం కలిసి ఈ నాలుగు ఆర్గనైజేషన్లను కలవడం జరిగిందని చెప్పారు. ఇదే సందర్భంగా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ గారు మాట్లాడుతూ.. మా మెంబర్స్ గా ఉన్న వాళ్ళు చాలా మంది వేషాలు లేక ఖాళీగా ఉంటున్నారని, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా వేషాలు లేక చాలా బాధల్లో ఉన్నారని చెపూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం మేము ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా ప్లాన్ చేస్తున్నామని, ఆ వెబ్ సైట్లో దాదాపు అందరి ఆర్టిస్టుల అడ్రెస్లు, ఫోన్ నెంబర్లతో పాటు వాళ్ళు చేసిన 1 నిమిషం పెర్ఫార్మెన్స్ వీడియో తదితర వివరాలు కూడా వెబ్ సైట్లో ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హీరో డా.రాజశేఖర్ గారు మాట్లాడుతూ.. మేము కలిసిన నాలుగు ఆర్గనైజేషన్స్ వాళ్ళు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నటీనటులందరికీ సహకరిస్తామని అంతేకాకుండా మేము నాలుగు ఆర్గనైజేషన్స్ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా కి పూర్తి సహకారం ఇస్తామని సహృదయంతో ప్రతిస్పందించారని, వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap