మాడభూషి సాహిత్య కళాపరిషత్ చెన్నై వారు అంతర్జాలంలో నిర్వహించే ‘సాహిత్యంతో నా సహవాసం’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 28-10-2021 గురువారం సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కనకాభిశేకి కీ.శే. చిటిప్రోలు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వం, జీవనశైలి, రచనాశైలి, రచించిన రచనలు వారితో అనుబంధం అన్న అంశంతో అంతర్జాల జామ్ మీటింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సభలో 18 మంది వక్తలు పాల్గొన్నారు. మాడభూషి సంపత్ కుమారుగారు సభను సాంఘిక గాయకుడు రమణ గాత్రంచే ప్రారంభించారు. తర్వాత చిటిప్రోలు వేంకటరత్నంగారు మాట్లాడుతూ మానాన్నగారి గురించి మేము చెప్పుకోవడం కంటే ఇతరులను భాగస్వామ్యం చేయడం ఎంతో సతోషమన్నారు. తర్వాత సీపాన పవిత్ర మాట్లాడుతూ హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ ప్రొపెసర్ అయిన బేతవోలు రామబ్రహ్మం గారు చిటిప్రోలు కృష్ణమూర్తి గారి రచనలమీద పి హెచ్ డి చేయమని చెప్పారు. వారి స్వగ్రామం పలనాడులోని గ్రామాలపాడుకు వెళ్ళి కలిశాను. వారికి వివరించగా వప్పుకున్నారు. వీరు రచించిన రచనలు చదువుతున్నడు ఎంతో అనుభూతినిచ్చాయన్నారు. రచనలలో ఎక్కువగా జాతీయాలు, సామెతలను ఎక్కువగా వడారని పదప్రయోగం సంస్కృతికి ఎక్కువ విలువ ఇచ్చేల ఉన్నాయని అంతటి మహోన్నతి వ్యక్తి యొక్క రచనలను పి హెచ్ డి చేయటం నాఅదృష్టంగా భావించినన్నారు. వీరు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తరువాత రేపల్లె నుండి మువ్వ వృశాద్రి పతి మాట్లాడుతూ పద్యరచనలో ఉన్నకవులలో కృష్ణమూర్తి గారిది అద్భుతశైలి అన్నారు. పురుశోత్తముడు రచన వివరిస్తూ భారతదేశంపై భక్తిభావన, దేశరక్షణ, చాలా చక్కగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అందులోని కొన్ని పద్యాలను నెమరువేసి ఇంకా చెపాల్సిన దిఎంతగానో ఉందని సమయాభావం వలన ముగిస్తు ఈ అవకాశం కల్పించినందుకు మాడభూషివారికి కృతజ్ఞతలు తెలిపారు.
తరువాత లక్ష్మణ మూర్తిగారు అక్షర దేవాలయం గురించి మాట్లాడుతూ ఆయన రచించిన పద్యరచనలు అన్నిటిని సేకరించానని అవి చాలా అద్భుతంగా ఉన్నాయని వారితో కలిసి మూడురోజులు ఉండటం ఎంతో అద్భుతమైన క్షణాలని వాటిని మరవలేనివని అటువంటివారిని ఇలా గుర్తుచేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెదొజు నాగేశ్వరరావుగారు మాట్లాడుతూ మావూరి కవి మహాకవి కళాతపశ్వ సాహిత్య అకాడమీ పురస్కా గ్రహిత పాదపద్మములకు నమస్కరిస్తూ అంటూ మొదలు పెట్టారు. కవికి మరణం వుండదు కవికి మరణం ఆభరణం లాంటిది అని. కృష్ణమూర్తి గారు రచించిన తరింగిణి అను రచనలో ఒక పద్యాన్ని ఆలపించారు. వివేకవాణి మరికొన్ని రచనల గురించి తెలియజేశారు. డా. భానూరి మంజుల మాట్లాడుతూ కృష్ణమూర్తి గారిమీద ఒక కవితను వివరించారు. ‘అతని బాటవలచిమ అవని అంతా కైలసం’ అనే పదం ఎంతగానో ఆకర్షించిదన్నారు. లోకేశ్వరరావు గారు మాట్లాడుతూ అందరికి కవిగానే తెలుసనని రచనలు చేయటం కాక మూలికా వైద్యం చేశేవారు, వైధ్యానికి ఏమాత్రం డబ్బు తీసుకోరు రైతులకు ఆపదలో ఉన్న వారికి అపద్భాందవుడిగా ఉండేవారని, రైతులతో ముచ్చటిస్తూ వారికి సలహాలు సూచనలు ఇస్తూ మహాకవిగా ఎదిగిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా భాదాకరం అన్నారు. నాగరాజ్య లక్ష్మి గారు మాఘమేఘములు శీర్శికపై మాట్లాడుతూ సంస్కృత సాహిత్యంలో ఉన్న సాంప్రదాయాలను పాటించారన్నారు. శిశుపాలవథ వంశస్త వృత్తంలో జరిగిందన్నారు. కృతార్తుడు అంటే యముడు అని అర్థం కానీ మరొకపదం కృష్ణమూర్తి గారు దైవం అని తెలియజేశారు. నిజమైన అనుభూతిని పొందితేనే మంచి రచనవస్తుందనడానికి కృష్ణమూర్తి గారు మనకు చక్కటి ఉదాహరణ అని ముగించారు. డా. సూర్యదేవర రవికుమారుగారు ప్రసంగిస్తూ తుమ్ముల కళాపీఠం ద్వారా కృష్ణమూర్తిగారు పరిచయం అయ్యారు అనిఅన్నారు. కొన్ని పద్యాలను ఆలపిస్తూ మహితశతకం గురించి వివరించారు. కష్టమైన రచనను చాలా సునాయాసంగా రచించగలరని అన్నారు. రసరాజుగారు చాలా రసవత్తరంగా మాట్లాడారు.వారితో ఉన్న అనుబంధాలను వివరించారు. గుమ్మా సాంబశివరావుగారు ప్రసంగిస్తూ కవిగారు స్థిత ప్రజ్ఞులని శిశుపాల వధ గురించి, ఇతరకవులు కైకేయిని విలన్ గా చూపిస్తే కృష్ణమార్తి గారు పచ్చాతాప పడిందని తెలియచేశారు. బీరం సుందరరావు గారు మాట్లాడుతూ తరంగిని శీర్శిక పై ప్రసంగిస్తూ ప్రతిఖండిక చక్కెరకండవలె ఉన్నదని తెలిపారు. స్వయంకృషితో తనకుతాను ఎదిగిన కవిగారు కృష్ణమూర్తిగారు. ఇక సుబ్బారావు గారు మాట్లాడుతూ ఆయన మీద ప్రేమతో రచించిన రచనను వివరించారు. కృష్ణమూర్తిగారి రచనలను విశ్లేసించి మాట్లాడిన వక్తలకు ప్రతివక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
-మల్లిఖార్జునాచారి