ప్రతినాయకుడి పాత్రకు గౌరవం తెచ్చిన ‘రామారావు’

ఈరోజు… ప్రసిద్ధ పౌరాణిక రంగ నటుడు మద్దాల రామారావు గారి వర్థంతి

తెలుగు నాటకరంగంలో, అందునా పౌరాణిక నాటకరంగంలో, సుప్రసిద్ధుడైన నటుడు మద్దాలరామారావు. పౌరాణికనాటకాలలో ప్రతినాయకుడి పాత్రకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టి వాటినే నాయక పాత్రలుగా మలిచి, ప్రేక్షకులచేత బ్రహ్మరథం పట్టించుకొని,ఎనలేని గౌరవప్రతిష్ఠలు పొందిన గొప్ప నటుడు. కళ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లకు ఉన్న ఆదరణ.. పౌరాణిక నాటకాల్లో మద్దాలకు ఉండేది. ఖరగ్‌పూర్‌, రాయపూర్‌ వంటి తెలుగేతర ప్రాంతాల్లోనూ ఆయనకు విశేషంగా అభిమానులు ఉన్నారు. మైరావణ, రావణ, దుర్యోధన వంటి పాత్రలకు రంగస్థలంపై జీవం పోశారు.

మద్దాల రామారావు ఆంధ్రప్రదేశ్ లోనూ… తెలంగాణలోనేకాదు..పశ్చిమబెంగాల్, ఒరిస్సా, తమిళనాడు,కర్ణాటకరాష్ట్రాలలోనూ.. వందలాది ప్రదర్శనలుఇచ్చి.. ప్రేక్షకులను మెప్పించిన ఘనత వారికే చెందుతుంది.

పశ్చిమగోదావరి జిల్లా..గణపవరంమండలం, జల్లికొమ్మరలో 6-9-1933న కీర్తిశేషులు మద్దాల వెంకన్న, మహంకాళి దంపతుల.. జ్యేష్ఠపుత్రుడిగ జన్మించారు రామారావుపెద్దచదువులు చదవకపోయినా.. స్వయంప్రతిభతో ఆయన నాటక ప్రస్థానం సాగింది. చాలా చిన్న వయసులోనే కీర్తిశేషులు టేకు సుబ్బారావు నిర్వహించే “లవకుశ” నాటకంలో లవుడి పాత్రలో తళుక్కున మెరిసారు.అదొక గొప్ప ముహూర్తం. నాటక రంగంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
కాలక్రమంలో, బాలుడు యువకుడయ్యాడు.

అనుకోకుండా “పల్నాటి యుద్ధం” నాటకంల “నరసింగరాజు” వేషం వేయడం..అందరి దృష్టి అటే నిలవడంతో..మద్దాల వారి అడుగులు ప్రతినాయక పాత్ర వైపే సాగాయి. అప్పుడే సుప్రసిద్ధ నాటకకర్త .. ప్రయోక్త అయిన ప్రగడ భద్రం గారి “తులసి జలంధర” నాటకంలో..”జలంధరుడిగా“నటించడం ఆరంభం అయ్యింది. అదొక ప్రసిద్ధనాటకం అయ్యింది. దీని తరువాత నాటకం “భూకైలాస్”. దాని తరువాత “భస్మాసుర” నాటకం వారికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టాయి. ఇక..”కురుక్షేత్రం” నాటకం గురించి చెప్పాల్సి వస్తే… మద్దాల వారిది “దుర్యోధన” పాత్రషణ్ముఖి ఆంజనేయరాజు గారిది “శ్రీకృష్ణ” పాత్ర. ఇద్దరు మహానుభావుల్ని అలా వేదిక పైన చూడగలడం నిజంగా అదృష్టమే అని చెప్పాలి.

తెలుగు పౌరాణిక నాటకాన్ని వెలిగించిన మహానుభావుడు మద్దాల.సినీ రంగంలో ప్రతినాయకుడు పాత్రల్లో ఎన్టీఆర్… ఎస్వీఆర్ ల్లా… తెలుగు రంగస్థలములో…శ్రీ మద్దాల వారికీ..శ్రీ ఆచంట వారికీ రారాజుల్లా.. నీరాజనాలు తెలుగు ప్రేక్షజులు పట్టే రంటే అతిశయోక్తి ఏమాత్రం లేద. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని కళారత్న బిరుదుతో ఘనంగా సత్కరించారు. వీరు తన 85 ఏట 6-2-2017న శివైక్యం పొందారు…
వారి కుమారుడు ఉదయభాను తన తండ్రిగారి.. వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

-వాడ్రేవు సుందర్రావు
నంది గరుడ అవార్డుల గ్రహీత

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap