నా ఇల్లే నా ప్రపంచం – మహేష్

తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు ఏది చేసినా, ఏది మాట్లాడినా అది క్షణాల్లోపే వైరల్ అవుతోంది. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చురుకుగా ఉంటున్నారు. ప్రతి దానిపై స్పందిస్తున్నారు. తెర మీద హీరోగా చెలామణి అవుతున్న ఈ హీరో రియల్ లైఫ్ లో కూడా తాను అసలైన హీరో నని ప్రూవ్ చేసుకున్నాడు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తో అటు తెలంగాణాలో ఇటు ఆంధ్రాలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడ ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఆర్ధిక సహాయం చేస్తున్నారు ప్రిన్స్. అయితే ఒక్కో సినిమాకు భారీ ఎత్తున ఫీజు వసూలు చేసే ఈ హీరో ఇప్పుడున్న నటుల కంటే ఎక్కువగా యాడ్స్ లలో కూడా నటిస్తున్నాడు.
ఎప్పుడైనా దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే నానుడిని మహేష్ అండ్ ఆయన భార్య నమ్రతలు వర్కవుట్ చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు ప్రయివేట్ యాడ్స్ తో చేతినిండా వెనకేసుకుంటున్నాడు మహేష్ బాబు. బ్రహ్మ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశ పరిచాయి. కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ దుమ్ము రేపాయి. భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో డైరెక్టర్ శివకు ఊహించని రీతిలో కారు గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రిన్స్. తాజాగా ఆయన సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం ఓ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందులో విశేషం ఏమిటంటే మొత్తం మహేష్ ఫ్యామిలీ మొదటి సారిగా ఇందులో నటించడం. తాజాగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దీపావళి సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఒక యాడ్‌లో మహేష్ తన భార్యాపిల్లలు.. నమ్రత, గౌతమ్, సితారతో కలిసి “నా ఫామిలీయే నా లైఫ్, నా ఇల్లే నా ప్రపంచం ” అంటూ సందడి చేశాడు. దీనిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొద్ది సేపట్లోనే హెవీగా చూశారు. అయితే ఈ ఒక్క యాడ్ లో నటించినందుకు మహేష్ బాబు ఏకంగా 6 కోట్లు తీసుకున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 30 సెకన్ల ఆ వీడియోలో మహేష్‌ను ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రెజెంట్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి కనిపించి, ఆ యాడ్‌కి మహేష్ అదనపు ఆకర్షణతో పాటు మైలేజ్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో తొలి స్థానంలో ఉంది. యమునా కిషోర్ దర్శకత్వంలో ఈ ప్రకటనను కళాత్మకంగా రూపొందించారు. మీరూ ఒకసారి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap