పట్టాభి కళాపీఠం విజయవాడ మరియు మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కథ, కవిత మరియు శాస్త్ర విజ్ఞానం పుస్తక పురస్కారాలను ది 26-1-2021 మంగళవారం గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదిక గా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ ఏడాది “మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారాన్ని తిరుపతి పట్టణానికి చెందిన ఆర్ సి కృష్ణ స్వామి రాజు కథల సంపుటి “ముగ్గురాళ్ళమిట్ట” కు బహుకరించారు. ఆచార్య రాయదుర్గం వెంకట సురేష్ కుమార్ మరియు ఏ మల్లేశ్వరరావు విశ్రాంత సంచాలకులు ఆల్ ఇండియా రేడియో అతిథులుగా పాల్గొని వారిని సత్కరించారు.
హైదరాబాదు సాహితీకిరణం పత్రిక వారి కార్యాలయంలో ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారాన్ని శ్రీ పొత్తూరి సుబ్బారావు మరియు
శ్రీ గంగాధరయ్య అతిథులుగా పాల్గొని శ్రీ దేశరాజు రవి కుమార్ రచించిన దుర్గాపురం రోడ్డు అనే కవితా సంపుటికి గాను వారికి పురస్కారాన్ని అందచేశారు
డాక్టర్ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ మిమిక్రీ కళాకారులు సిల్వస్టర్ చేతుల మీదుగా డా. కె.వి రావు స్మారకశాస్త్ర విజ్ఞాన పుస్తక పురస్కారాన్ని కవి- చిత్రకారుడు శ్రీ ఆత్మకూరు రామకృష్ణ తానూ రచించిన హస్తలేఖనం ఒక కళ కు గాను అందుకొన్నారు ఈ పురస్కారం క్రింద ప్రతి విజేతకు రు5116/- లు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందించినట్లు శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. మక్కెన శ్రీను గారు తెలిపారు. రచయితుల పుస్తకాలను శ్రీ మల్లేశ్వరరావు, శ్రీ పుప్పాల శ్రీరామ్ మరియు కొండ్రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి పరిచయం కావించారు ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.