మల్లెతీగ పురస్కారం-(2026) కవితలకు ఆహ్వానం

మంచి సాహిత్యాన్ని ‘రికార్డు’ చేయాలన్న సత్సంకల్పంతో 2013లో మల్లెతీగ పురస్కారాన్ని ప్రారంభించాం. అప్పటి నుండి కరోనా వరకు నిరాటంకంగా ఏడేళ్ళపాటు కొనసాగించాం. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ పురస్కారాన్ని కొనసాగించలేకపోయాం. మళ్లీ ఈ సంవత్సరం నుండి మల్లెతీగ పురస్కారాన్ని కొనసాగించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

‘మల్లెతీగ పురస్కారం-2026’కు తెలుగు కవులందర్నీ ఆహ్వానిస్తున్నాం. కవితలు సామాజికాంశాల్ని స్పృశించేవిగా వుండాలి. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా రాసిన కవితల్ని మాత్రమే పంపాలి. సమాజంలో వున్న ఏ సమస్యనైనా కవితగా మలచవచ్చు. కవిత నిడివి విషయంలో క్లుప్తత పాటించాలి. పెద్ద కవితలు పోటీకి స్వీకరించడం కుదరదు. కవిత కాగితానికి ఒక వైపే రాయాలి. కవిత రాసిన కాగితంపై పేరూ, చిరునామాలు రాయకూడదు. విడిగా హామీపత్రం రాస్తూ అందులో మీ పేరు, చిరునామా రాయాలి. కవితతోపాటు మీ ఫొటో కూడా పంపాలి. కవిత ఒక కాపీని మీ దగ్గర వుంచుకోవాలి. మాకు పంపిన కవితల్ని తిప్పి పంపడం కుదరదు.

కీ.శే. వజ్జల విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జవాన్ల గేయ రచయిత (ప్రస్తుతం నవమల్లెతీగలో ‘వృద్ధోపనిషత్’ గేయాలు రాస్తున్నారు) వజ్ఝల కృష్ణమూర్తి శర్మ- యుఎస్ఏ గారి సహృదయ సౌజన్యంతో ఈ పురస్కారాన్ని మల్లెతీగ సాహిత్యం సేవాసంస్థ కొనసాగిస్తుంది.

ప్రధాన పురస్కారం పొందిన కవికి రూ. 8,000/-ల నగదుతో సత్కారం వుంటుంది. ఆత్మీయ పురస్కారం పొందిన ఐదుగురి కవులకు రూ. 1,000/-ల చొప్పున నగదుతో సత్కారం వుంటుంది. పురస్కార గ్రహీతలు విజయవాడలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభకు తప్పక హాజరై పురస్కారాన్ని స్వయంగా తీసుకోవాలి. పురస్కార గ్రహీతలకు నగదుతోపాటు శాలువా, జ్ఞాపిక, సర్టిఫికెట్టు వుంటాయి. ప్రధాన పురస్కారం పొందిన కవి/కవయిత్రి ఫోటో నవమల్లెతీగ మాసపత్రిక ముఖచిత్రంపై రంగుల్లో వస్తుంది. కవితల్ని కొరియర్ లేదా రిజిస్టర్ పోస్టులో పంపాలి.

ఎడిటర్, నవమల్లెతీగ మాసపత్రిక, 26-16-4, టి.ఎఫ్ – 1, శుభశ్రీ టవర్స్, ఉయ్యూరు జమీందారు స్ట్రీట్, గాంధీనగర్, విజయవాడ-520 003 చిరునామాకు జూన్ 30వ తేదీలోగా పంపాలి.

ఈ మెయిల్ ద్వారా కవితల్ని పంపేవారు malleteega.sss@gmail.com కు పంపవచ్చు.
పూర్తి వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు.

Share via
Copy link
Powered by Social Snap