నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ

స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఒక లెజెండ్‌, ఒక హీరో. ఆ కాంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. స్వరాజ్యం ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. పరదాల చాటున పెరిగారు. పరదాల చాటున్నే చదువు సంధ్యలు నేర్చుకున్నారు. మొదట స్వాతంత్య్రోద్యమంలోనూ ఆ తరువాత తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. నిర్మొహమాటానికి, ధైర్యానికి పెట్టింది పేరు. ఆమె అంటే సహచరుకే కాదు, నాయకులకు కూడా అభిమానమూ – భయమూ రెండూ వుండేవి. చక్కని వాక్చాతుర్యంతో, హాస్య సంభాషణతో ఆకట్టుకుంటూ తన తరానికే కాదు, తర్వాతి తరానికి కూడా గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలిచారామె. అరమరికలు లేకుండా అందరితో కసిపోయే మనస్తత్వం వల ఇతర నాయకుకంటే ఆమె ఎంతో భిన్నంగా కనిపించేవారు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాలా విక్షణంగా వుంటాయి. ఇలాంటి వ్యక్తి శతాబ్దానికి ఏ ఒక్కరో వుంటారు. మల్లు స్వరాజ్యం రెండు శతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు.

మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణా సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజ సామూహిక తిరుగుబాటు చరిత్ర. పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర.
రాజకీయాలోకి మహిళలు రావటమంటే మల్లు స్వరాజ్యం గారిలా రావాలి. అధికారం, పెత్తనం, అనేకానేక స్వీయ ప్రయోజనాను ఆశించి రాజకీయాలోకి వచ్చిన నాయకురాళ్లకు పూర్తిగా భిన్నం ఆమె రాజకీయ జీవితం. మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమెలాగో నేర్పే గొప్ప పాఠం ఆమె తొలినాళ్ల జీవితం.

మల్లు స్వరాజ్యం తన పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఆనాడు తనలో ఏ నిప్పు రవ్వ రాజుకుందో ఇవాళ 86 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆ జ్వాల అలాగే ఎగిసిపడుతూ వుంది. ఈ రోజు కూడా ఆమె ఎంతో స్పష్టతతో, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ, పోరాడుతూ ఎందరో మహిళకు స్ఫూర్తినిస్తున్నారు. కార్యాచరణకు పూనుకునేలా ప్రేరణను అందిస్తున్నారు. ‘‘నా గొంతే నాకు నా తుపాకి, తూటా’’ అంటారామె. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఏనాడూ వెనుకంజ వేయని ధీరత్వం ఆమెది. ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ.ఎందరికో స్పూర్తిదాయక మైన తన జీవన పోరాటాన్ని ‘నా గొంతే తూపాకి తూట ‘ పేరుతో అత్మకథ గా రాసారు. ఈ పుస్తకంలో ప్రతీ పేజీ ఆశక్తికరంగా చదివిస్తుంది, ఆలోచనలను రేకేత్తిస్తుంది.

-కె.యస్.

నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ
136 పేజీలు, వెల: రూ.120/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ – 500006
ఫోన్‌: 040 23521849

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap