ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కనియంపాడు అనే చిన్న గ్రామంలో వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండ్లతోటల్లో, ప్రశాంత వాతావరణంలో, ఆ గ్రామానికే చెందిన బాలికలకు శిక్షణఇచ్చి “మనసు ఫౌండేషన్” వారు చేస్తున్న “నిశ్శబ్ద తెలుగు సాహిత్య పరిరక్షణా విప్లవం” భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖియించదగ్గది. మనసు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ మన్నం రాయుడు గారు, పద్మశ్రీ డా. మన్నం గోపీచంద్ గారు, మన్నం చంద్రమౌళి గారు వారి సిబ్బంది లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ సాహితీ యజ్ఞపు కృషిని ప్రతీ తెలుగు భాషాభిమాని ఎంతైనా అభినందించ దగ్గది.
ఇప్పటికి కోటి పుటలను అక్షరనిక్షేపం (డీజిటీకరణ) చేసిన సందర్భంగా జనవరి 13న కనియంపాడులో జరిగిన మహోత్సవంలో శ్రీయుతులు మన్నం రాయుడు, డా. మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి, మన్నం కుటుంబం, సిబ్బంది, శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్, డా. మండలి బుద్ధప్రసాద్, డా. కామినేని శ్రీనివాస్, డా. కేతు విశ్వనాథ రెడ్డి, శ్రీ అశోక్ పారా, డా. సుశీలమ్మ మొదలైన వందలాది సాహిత్య ప్రియులు పాల్గొన్న ఈ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మనసు ఫౌండేషన్ వారికి తెలుగు ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు.
డా. ప్రసాద్ తోటకూర,
తానా ప్రపంచ సాహిత్యవేదిక.