సూపర్‌స్టార్ కృష్ణగారి కుమార్తె, మహేష్ బాబు మంజుల ఘట్టమనేని ‘షో’ సినిమాతో నటిగా, నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మనసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగానూ మారారు. కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటూ వస్తున్న ఆమె ఇప్పుడు సొంత వెబ్ సైట్, యూట్యూబ్ చానళ్లను ప్రారంభించారు. జూన్ 8, సోమవారం ఉదయం 10 గంటలకు manjulaghattamaneni.com పేరుతో వెబ్ సైటు, ManjulaGhattamaneni పేరుతో యూట్యూబ్ చానల్ ను ప్రారంభించారు. నా భావాలను వ్యక్తపరచడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు సిద్ధమవుతున్నందుకు సూపర్ గా ఎగ్జయిట్ అవుతున్నా అంటూ ఆమె తెలిపారు. తన వెబ్ సైట్, యూట్యూబ్ చానల్ అందరూ ఆదరిస్తారనీ, సబ్ సైబ్ అవుతారనీ ఆశిస్తున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. సో ఒకసారి మీరూ చూడండి…