మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

ఒక చిత్రం…. వేయి భావాలను పలికిస్తుంది.

ఒక చిత్రం… వేల ఊహలకు ఊపిరి పోస్తుంది.

ఒక చిత్రం… కొన్ని వేల హృదయాలను తాకుతుంది.

ఒక చిత్రం…. కొన్ని వేల మస్తకాలకు పదును పెడుతుంది.

ఒక చిత్రం…. ప్రకృతి గురించి ఆలోచించమని ప్రాధేయపడుతుంది.

ఒక చిత్రం… ప్రకృతిలోని ప్రాణులను రక్షించమని వేడుకొంటుంది.

మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతిలో మనతో పాటే సంచరించే పిచ్చుక… ప్రపంచీకరణ నేపథ్యంలో, సాంకేతిక అడ్డంకులతో తన ప్రాణం పోగొట్టుకుంటున్న సందర్భంలో రామునికి ఉడుత సాయంగా ప్రకృతిలో కిచకిచమంటూ తిరిగే ఈ చిరు ప్రాణిని మనమంతా అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

Spoorthi Srinivas

ఒకప్పుడు పిచ్చుకల కోసం మన పూర్వీకులు ఎంతో తపన పడేవారు. వాటికోసం ఇంటి ముంగిట వరండాలో జొన్న కంకులు, వరికంకులు, సద్ధకంకులు వేలాడదీసేవారు. వాటిమీద వాలి పిచ్చుకలు తమ ఆహారాన్ని సంపాదించుకొని, ఇటూ అటూ ఎగురుతూ, తమ కిచకిచలతో ఈ ప్రకృతిని అందమైన ప్రపంచంగా మార్చేవి. రైతులకు సహాయపడేవి. వివిధ పంటలకు హాని చేసే క్రిమికీటకాదులను తమ ఆహారంగా తిని, వ్యవసాయానికి ఎంతో సాయం చేసేవి. పర్యావరణ సమతుల్యాన్ని, జీవవైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడేవి.

అలాగే వివిధ రకాల ధాన్యపు గింజలు పిచ్చుకల కోసం చల్లేవారు.

అవి ఆనందంగా పంచలో వాలి మన పంచనే ఉండేవి. ఆధునికత పెరిగిన తర్వాత సెల్ టవర్ రేడియేషన్, గాలి కాలుష్యం, వలన వాటి సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. గాలిపటాల దారాలకు చిక్కుకొని చనిపోతున్నాయి.

అపార్ట్మెంట్ కల్చర్ పెరగడం వల్ల, నివాసాన్ని కోల్పోతున్నాయి. పిచ్చుకల జాతి అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ పిచ్చి పనులన్నీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలయ్యాయి. ఇవే కాకుండా పండ్ల ఉత్పత్తిలో రసాయనాలు ఉపయోగించడం, చెట్లను కొట్టి వేయటం, ఆహారధాన్యాలలో అనేక కృత్రిమ ఎరువులు వాడటం వల్ల పిచ్చుక జాతి అంతరించి పోతుందని పరిశోధనల్లో తేలింది.

మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

– పిచ్చుకల జీవన కాలం మూడేళ్ళు.
-కథల్లో, పాటల్లో, సామెతల్లో పిచ్చుకకు ప్రాధాన్యం.
-మానవులు-పిచ్చుకల మధ్య విడదీయరాని బంధం.
-బతుకు మీద ఆశకు ప్రతి రూపాలు పిచ్చుకలు.
-మగ పిచ్చుక బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా ఉంటుంది.
-గడ్డి పరకలు, పుల్లలతో అందమైన గూళ్ళు నిర్మించే మోడ్రన్ ఆర్కిటెక్.
-త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు.

Sparrow huts and Flacards by Save Sparrow team

పిచ్చుకల సంరక్షణకై మనం చేయవలసిన కొన్ని అవగాహనా కార్యక్రమాలు


  • ఫ్లకార్డ్ చాలెంజ్ (పిచ్చుక చిత్రంగల కార్డు ప్రదర్శించడం),
  • పిచ్చుక గురించి సమాచారం తెలియజేస్తూ కరపత్రాలు ముద్రించడం,
  • వైవిధ్యమైన పిచ్చుక చిత్రాలు ప్రచారం చేయటం.
  • పిచ్చుకల గురించి లఘు చిత్రాలు ప్రదర్శించడం.

*పిచ్చుకల సంరక్షణకై చిత్రలేఖనం పోటీలు నిర్వహించటం.

పిచ్చుకల గురించి కవితలు రాయించడం.

  • పిచ్చుకల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, సందర్భాలను, సంఘటనలను జీవన చిత్రణ చెయ్యటం.
  • ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పిచ్చుకను అందరికీ పరిచయం చేసి వాటి జీవన విధానం పట్ల అప్రమత్తం చేయడం.
  • పిచ్చుకల ను కాపాడడం ఎలా అన్న అంశంపై వర్క్ షాపులు నిర్వహించడం.
  • పిచ్చుకపై చిత్రప్రదర్శన చేయడం. పిచ్చుకల కోసం మనం ఏం చేయవచ్చు

  • పిచ్చుకల కోసం కృత్రిమ నివాసాలు ఏర్పాటు చేయడం.
  • మన ఇంటిపైన, ఇంటి ముందర గోడలపైన చిన్నచిన్న గిన్నెలలో నీళ్ళు నింపడం.
  • బియ్యం, జొన్నలు, సజ్జలు వివిధ వివిధ రకాల ధాన్యపు గింజలు వాటికి అందుబాటులో ఉంచడం.
  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు దారాలు వాటికి తగలకుండా జాగ్రత్త పడటం.
  • నేటి విద్యార్థులకు/యువతకు అవగాహన కల్పించడం.

“స్ఫూర్తి” శ్రీనివాస్, విజయవాడ.
9985857599

1 thought on “మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap