కరోనా తర్వాత మామూలు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో…
సామాజిక దూరాన్ని తగ్గించి, సాంస్కృతిక కార్యక్రమాలలో మమేకం అవుతున్న వేళ…
తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోనకు చెందిన ‘ఆకొండి అంజి’ అనే యువ చిత్రకళాకారుడు ముందుకొచ్చి తన ‘క్రియేటివ్ హార్ట్స్’ ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో 30 మందితో బృంద చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం కళాకారులకు… కళాభిమానులకు… శుభపరిణామం…!
ఏప్రిల్ 3 న విజయవాడ బాలోత్సవ్ భవన్ ఆర్ట్ గ్యాలరీలో… ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు ‘మాస్టర్ స్ట్రోక్ గ్రూప్ షో’ లో తమ కళాసృజనను ఆవిష్కరించనున్నారు. ప్రముఖ రియలిస్టిక్ చిత్రకారులు శేష బ్రహ్మం గారు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు.
రాజేటి కరుణాకర్ అడవి బిడ్డల జీవన విధానాన్ని, రంగులో ముంచి కాన్వాస్ మీద ఆవిష్కరిస్తే, చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పనవసరం లేదు. ఆయన అనుభవాన్ని పరిశీలనా శక్తిని, చిత్రకళకు జోడించి ఎన్నో అద్భుతాలు చేశారు.
చిత్రకళలో పట్టభద్రులైన వీరు పెండ్యాల వాటర్ కలర్ వేయడంలో దిట్ట. అలాగే సప్త వర్ణాలను తనదైన బాణీలో కూర్చి, పేర్చి Abstract Art ఫొరంస్ లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
ఏలూరుకు చెందిన శ్రీనివాస్ పతంగి హైపర్ రియల్ స్టిక్ ఆర్ట్ అనే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతి కొద్దిమంది చిత్రకారుల్లో ఈయన మొదటి రెండు మూడు స్థానాల్లో ఉంటారు. ఈయన బొమ్మలు చూస్తే లెన్స్ కెమెరాలు కూడా తనని తాను మోసం చేసుకుంటున్నామా అని ఆలోచనలో పడతాయి టెక్నాలజీని మించిన పనితనం ఈయన బొమ్మల్లో కనబడుతుందంటే ఈయన ఎంత గొప్ప ఆర్టిస్ట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
యానాం కు చెందిన మల్లాది బాలు గారి చిత్రాల్లో కంపోజిషన్, ప్రజెంటేషన్, ఈస్తటిక్ వ్యాల్యూస్ తో పరిపూర్ణమైన పెయింటింగ్ ని రూపొందించగల సమర్ధుడు. చార్కోల్ డ్రాయింగ్స్ మరియు చార్ కోల్ పోర్ట్రైట్ చేయడంలో సిద్ధహస్తులు.
కందిపల్లి రాజు రాజమండ్రికి చెందిన కమర్షియల్ అండ్ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. ఎంత పెద్ద బొమ్మ నైనా, ఎంత పెద్ద సైజు అయినా, అవలీలగా, అద్భుతంగా, ఫలితాన్ని తీసుకురాగల నేర్పరి.
గంటా మధు గారు అనుభవానికి నిలువెత్తు నిదర్శనం. ఓర్పు, నేర్పు, అనుభవం ఈ మూడింటిని ఒకచోట చేర్చితే అదే గంట మధుగారు. కమర్షియల్ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా అనుభవశాలి.
రియలిస్టిక్ ఆర్ట్ ని అత్యద్భుతంగా ఆవిష్కరించగల సమర్థవంతమైన ఆర్టిస్ట్ జగ్గంపేట కు చెందిన శేఖర్. మనుషుల రూపచిత్రాలు వేయటంలో సిద్ధహస్తులు.
ప్రస్తుత గద్వాల జిల్లా, గద్వాల పట్టణ వాసి అయినటువంటి ఈరన్నగారు అనుభవానికి నిలువెత్తు నిదర్శనం. కర్ణాటక చిత్రకళా పరిషత్ నుంచి చిత్రకళలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి ఈరన్న గారు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు. రేఖాచిత్రాలు గీయటంలో ఎంతో అనుభూతి పొందుతారు.
మహబూబ్ నగర్ కు చెందిన వెంకట్ జెట్టి గారు అద్భుతమైన రేఖాచిత్రాలు గీయడంలో దిట్ట. ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు.
హైదరాబాద్ కు చెందిన కొప్పు చంద్రశేఖర్ ఫైన్ ఆర్ట్స్ లో బాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం షాఫ్ట్ మీడియా ఆఫ్ యానిమేషన్ కాలేజీలో HOD గా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్ ఈ ‘మాస్టర్ స్ట్రోక్ గ్రూప్ షో’ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
చెర్ల కు చెందిన బీర శ్రీనివాస్ స్టోరి ఇలస్టేటర్ గా, చిత్రకారుడిగా తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలను తన చిత్రాల ద్వారా అందిస్తున్నారు.
క్యారికేచర్ ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఒక మనిషిని తనకున్న మానసిక బలహీనతలను అన్నింటినీ పక్కనపెట్టి చక్కిలిగింతలు పెట్టినట్టుగా మనసుని ఆహ్లాదంగా మారుస్తాయి అటువంటి క్యారికేచర్ రంగాన్ని ఎంచుకుని ప్రపంచ వేదిక మీద తన క్యారికేచర్ ని ఉంచిన అద్భుతమైన చిత్రకారులు మధు మండా గారు.
ఆనిల్ జనకం.. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి BFA, JNFAU HYDERABAD నుంచి MFA PAINTING పూర్తి చేశారు. ఒకపక్క కాన్వాస్ మీద పెయింటింగ్ కు సంబంధించి ఎన్నో ప్రయోగాలు ప్రస్తుత పరిస్థితులు కళాత్మకంగా కహానీలో ఆవిష్కరించి ప్రయత్నాలు చేస్తూనే గోడమీద మరోపక్క అందమైన MURAL PAINTINGS చేస్తున్నారు.
లంబాడాల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సంతోషాన్ని, జీవన విధానాన్ని, అడవి బిడ్డల ఆత్మసౌందర్యాన్ని, తన పెన్నులో నిండుగా నింపుకొని సరికొత్తగా ఆవిష్కరిస్తున్న బాబు పేరుపల్లి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసి, MFA printmaking లో అత్యంత అందమైన లైన్ డ్రాయింగ్ వేయడంలో పరిపూర్ణత సాధించారు.
ఇంకనూ వీరే కాకుండా మరికొంతమంది Student Strokes కూడా ఉన్నాయి ఈ ప్రదర్శనలో.
Thank you so much sir🙏
veeru pendyala
మాస్టర్ స్త్రోక్స్ పేరుతో క్రీయేటీవ్ హార్ట్స్ సంస్థ నిర్వహిస్తున్న సామూహిక చిత్ర ప్రదర్శన గురించి ఒక చక్కటి ఆర్టికల్ ఇది రచయితకి కళాసాగర్ గారికి నిర్వా హకులకు చిత్రకారులకు అభినందనలు
Excellent