హైదరాబాదు లో గురువారం(19-08-21) సాయంత్రం మెగా క్రియేషన్స్ సంస్థ పి. శ్రీనివాసరావు నిర్వహించిన, ఆల్ టాలెంటెడ్ & గ్రేట్ ఎచ్చివర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాటగిరిలో కళా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు, గొప్ప చరిత్ర కలిగిన మన దేశం స్వతంత్రతను 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమున 75 ఇయర్స్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్.. ప్లాటినం జూబ్లీ అవార్డ్స్ 2021 హైదరాబాద్ ఫోనిక్స్ ఎరీనా గార్డెన్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ స్పెషల్ అడ్వైజర్ డాక్టర్ ఎస్ వేణుగోపాలచారి న్యూఢిల్లీ, ప్రత్యేక అతిధి హీరో & నిర్మాత రామ్ ఖీ, డాక్టర్ రామ్ తిలక్, శ్రీమతి శ్రీ దుర్గా రాజేశ్వరి, ఎస్.కె మజీద్ అహ్మద్, ఎల్లా సుబ్బారెడ్డి, మరియు డాక్టర్ గోపరాజురవికుమార్ విచ్చేసి డాక్టర్ శ్రీమతి శ్రీ అరుణ సుబ్బారావు సభ అధ్యక్షతన ఎంపికైన కళాకారులకు అవార్డులు ప్రధానం చేశారు. డాక్టర్ వేణుగోపాల చారి మాట్లాడుతూ కళాప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహిస్తున్న మెగా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు, అవార్డు అందుకుంటున్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అందరికీ ప్రత్యేకమైన సూచనలు తెలియజేశారు.
వ్యవసాయ రంగాన్ని నాటకరంగాన్ని కళాకారులను కాపాడుకోవటం అటు ప్రభుత్వానికి ఇటు మన అందరికీ బాధ్యత ఉంది అంటూ తెలియజేస్తూ…మన దేశం యొక్క చరిత్రను, గొప్పతనాన్ని, మహనీయులత్యాగాలను గుర్తు చేశారు.. ఈ సందర్భంలో నిర్వహించిన డాక్టర్ ఎస్ పి ఎస్ వాసు గారి ఫ్లూట్ వాయిద్యం, జానపద గీతాలు దేశభక్తి గీతాలు, వినోదభరిత కళాప్రదర్శనలు, చిన్నారుల కూచిపూడి ,భరత నాట్య నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .. ప్రతిభను గుర్తించి అవార్డు ప్రధానం చేసిన మెగా సంస్థ వారికి అవార్డు అందుకున్న కళాకారులు అందరూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు… అవార్డు అందుకున్న ప్రతిభావంతులు.. డాక్టర్ ఎస్ పీ ఎస్ వాసు, నంద్యాల శ్రీనివాస రావు , వెంపటి రంగారావు, వెలగపూడి రవి, వల్లి బోయిన శ్రీనివాసరావు, రామగిరి స్వరిక, నాగ మహేశ్వరయ్య, సలావుద్దీన్, దస్తగిరి, నరసింహారావు,గోపి,MM రాజా, సతీష్ రెడ్డి, సంపత్ కుమార్, వైష్ణవి,మేఘన మరియు తదితరులు ఉన్నారు.