స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

తెలుగు కథ పాఠకుల నుంచి ప్రేక్షకులను చేరుకుంటోంది. కొత్తదారులూ, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ‘ఓటీటీ ‘ ప్లాట్ ఫామ్స్ కొత్త కంటెంట్ కోసం లిటరేచర్ వైపు చూస్తున్నాయి. తెలుగులో తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నాలుగు తెలుగు కథలతో ఒక వెబ్ యాంథాలజీ రూపొందుతోంది. ప్రముఖ ఓటీటీ యాప్ ‘ఆహా’ ఇందుకు ఆరంభం పలికింది. మెట్రో నగరం నేపథ్యంలో ఉన్న నాలుగు కథలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ‘మెట్రో స్టోరీస్’ పేరుతో యాంథాలజీగా రూపొందించారు. ‘పలాస’ డైరెక్టర్ కరుణ కుమార్. ‘ఆహా! యాప్లో ఆగస్టు 14న విడుదల కాబోతున్న ‘మెట్రో కథల’ గురించి కరుణ కుమార్  పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు..

ఒకటి నుంచి నాలుగు
‘ఆహా’ కోసం ఒక్కో కథను ఒక్కో డైరెక్టర్‌తో చేయించాలని అనుకున్నారు. థీమ్ బేస్ట్ కావాలని అడిగారు. నలుగురు డైరెక్టర్లు నాలుగు కథలు చేయాలి. అందులో మీరు ఒకటి చేస్తారని అని అడిగారు. నేను సొంతంగా ఒక కథ రాసి చేద్దామనుకున్నా, అది జరుగుతుండగా కరోనా ప్రభావం పెరిగింది. నాన్ స్టార్ట్ అయింది. ఒక రోజు కథల సెషన్ పెట్టుకున్నారు. జూమ్ ద్వారా నా కథను నేను చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫోన్ చేసి, మిగతా కథలు నచ్చలేదండి. మీరే రెండు కథలు చేయండి అన్నారు. తర్వాత నాలుగు కథలూ మీరే చేయండి అని చెప్పారు. అలా ఒకటి నుంచి నాలుగు కథలు నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది.

సాహిత్యం నుంచి వచ్చిన కథలు
‘మెట్రో కథలు’ సంకలనంలో 1. సెల్ఫీ, 2 ప్రపోజల్, 3. తేగలు అనే మూడు కథలు తీసుకున్నాము. ఖదీర్ బాబుగారు రాసిన సంకలనం ఇది. అలాగే 4వ కథ అయిన ఘటనను ‘బియాండ్ కాఫీ’ అనే సంకలనం నుంచి స్వీకరించాం. అవన్నీ సాహిత్యం నుంచి వచ్చిన కథలు. సాహిత్యం నుంచి వచ్చిన చిత్రాల్లో కొన్ని వందల సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కదా.. అలాంటిదే ఇది. జీవితాల్లోంచి వచ్చిన కథలు ఇవి.

షూటింగ్ మొత్తం కరోనా టైమ్ లోనే….
‘మెట్రో కథలు’ షూటింగ్ మొత్తం కరోనా టైమ్ లోనే జరిగింది. షూటింగ్లు చేసుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన పది రోజుల తర్వాత మొదలైంది. కేవలం హైదరాబాద్ సిటీలోనే ఈ ‘మెట్రో కథలు’ను రూపొందించాం.

తెలుగులో ఫస్ట్ టైమ్
‘మెట్రో కథలు తెలుగులో ఫస్ట్ టైమ్ వస్తున్న యాంథాలజీ, రెగ్యులర్ గా వచ్చే రొమాంటిక్ కామెడీలు, యాక్షన్ సీన్లు, మర్దర్
ఢిల్లర్స్ కాకుండా ఇవన్నీ మనం రోజూ చూసే జీవితాలకు సంబంధించినవి. ముఖ్యంగా ఇవన్నీ ఫీమేల్ సెంట్రిక్ కథలు. ఆడవాళ్ల సమస్యలను గట్టిగా చర్చించిన కథలు, మెట్రో కథలు-

వన్ సిటీ.. ఫోర్ స్టోరీస్
‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ గారు, కంటెంట్ అడ్వయిజరీ కమిటీలోని దర్శకులు చంద్ర సిదార్ధ గారు, నందిని రెడ్డిగారు ఒక్క సిట్టింగ్ లో ఈ కథలు విని ఓకే చేశారు. సినీ నటి సన ‘ఘటన’లో ముఖ్య పాత్ర పోషిస్తుండగా, నటుడు రాజీవ్ కనతాల ‘తేగలు’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘పలాసా’లో అందరికీ నచ్చిన నక్షత్ర, తిరువీర్ ‘ప్రపోజుల్లో చేస్తున్నారు. ఇక ‘సెల్ఫీని నందిని రాయ్, రామ్ మద్దుకూరి చేశారు. ప్రభాస్ “పారమి’, సుకుమార్ ‘100% లవ్’ సినిమాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ ఈ ‘మెట్రో కథలు’కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

SA: