శ్రీ రవీంద్రనాథ్ ఆలపాటి సంస్థాపక సంపాదకులుగా, శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ సంపాదకులుగా, శ్రీ ఆలపాటి బాపన్న ప్రచురణకర్తగా మేలైన సాహిత్యాంశాలు, వ్యాసాలు, చిత్ర వర్ణచిత్రాలు, ప్రముఖ సంగీత, సాహితీవేత్తల, స్పూర్తి ప్రదాతల జీవితాలను పరిచయంచేస్తూ – గత పాతిక సంవత్సరాల నుండి వెలువడుతూ, రజతోత్సవం జరుపుకుంటున్న “మిసిమి” మాసపత్రిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కలికి తురాయి.
నా మాతృదేశ పర్యటనను పురస్కరించుకుని మిసిమి యాజమాన్యం జనవరి 19న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో కొంతమంది విశిష్ట రచయితలతో ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటుచేసి, తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తం చెయ్యడంలో ఉన్న సవాళ్ళను చర్చించడం చాలా ముదావహం. అందరి తరపున ఆత్మీయ సత్కారం అందించిన అశ్వినీ కుమార్ గార్కి, వారి సిబ్బందికి, హాజరైన ప్రముఖులందరకూ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు:
శ్రీయుతులు – వల్లభనేని అశ్వని కుమార్, చెన్నూరు ఆంజనేయరెడ్డి, IPS, వోలేటి పార్వతీశం, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య వై. పార్థ సారథి, డా. అవధానం రఘు కుమార్, అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రావి రాంప్రసాద్, వి. రాజారామ మోహన్ రావు, యన్. వి. హనుమంతరావు, సి.ఎస్. రాంబాబు, వలేటి గోపీచంద్, టి.వి. ప్రసాద్, వెంకట సిద్ధారెడ్డి, మహి.
డా. ప్రసాద్ తోటకూర,
తానా ప్రపంచసాహిత్యవేదిక.