అలరించిన మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, జాషువా సాంస్కృతిక వేదిక మరియు కామ్రేడ్ జి.ఆర్.కే & పోలవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ రోజు(20-08-2023) విజయవాడలో బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ మరియు ఫోటో ఆర్ట్ కాంటెస్ట్ సందర్శకులను అలరించింది.

ఈ మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ లో 20 మంది యువ ఫోటోగ్రాఫర్స్ తీసిన 80 “ఆకాశం-మబ్బులు” అంశం పై తీసిన చిత్రాలను ప్రదర్మించారు. ఈ ప్రదర్శనను ఈ రోజు 10 గంటలకు CII ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ డాక్టర్.ఎమ్. లక్ష్మీ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. “ఆకాశం-మబ్బులు” అంశంపై తీసిన ఫోటోలకు సుబ్బు ఆర్వీ ఇచ్చిన చక్కని శీర్షికలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 6 నుండి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు వినూత్నంగా ఫోటో ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో సుమారు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్. ఇండ్ల స్వప్న, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి, బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు గ్రహీత పాలడుగు అనసూయ, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ప్రతినిధి పిన్నమనేని మురళీ కృష్ణ, కామ్రేడ్ జి.ఆర్.కే & పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, సోమూరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రేష్మా సోమూరి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతీ ప్రదానోత్సవానికి ముందు చిన్నారుల నృత్య కార్యక్రమాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో “ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, స్ఫూర్తి శ్రీనివాస్, కళాసాగర్ యెల్లపు, ఎస్.పి. మల్లిక్, టీం మెంబెర్స్ స్వాతి పూర్ణిమ, సుధారాణి, శ్రావణ్ కుమార్ లు పాల్గొన్నారు.
-కళాసాగర్

SA:

View Comments (1)

  • బాలల్లో సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు
    *అభినందనలు*