కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాలలో నటించి, 50 సినిమాలు నిర్మించిన ఈ లెజెండరీ యాక్టర్ కోసం స్క్రిప్టులు రాయడం అనేది అనేకమంది దర్శకులకు ఓ ఛాలెంజ్. లేటెస్ట్ డాక్టర్
మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో ఆయన కథానాయకునిగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాపులర్ స్క్రిప్ట్/ డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 శనివారం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో తీక్షణంగా చూస్తున్న మోహన్ బాబు కనిపిస్తున్నారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ ను ఆకర్షణీయంగా, దేశభక్తి ఉట్టిపడేలా డిజైన్ చేశారు. ఇంతవరకు తెలుగు తెరపై కనిపించని కథాంశాన్నీ, జానర్ నీ ఈ సినిమాలో చూడబోతున్నాం. అలాగే ఇదివరకెన్నడూ మనం చూడని పవర్‌ఫుల్ పాత్రను మోహన్‌బాబు పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు పనిచేస్తున్న తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
మోహన్ బాబు లాంటి హీరో కూడా తన చిత్రానికి ఇంగ్లీష్ లో పేరు పెట్టుకోవడం సరికాదు. పక్క తమిళనాడు ను చూసైనా నేర్చుకోవాలి. తెలుగు సినీ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోకడ బాగా పెరింగింది. భరత పుత్రుడు అని పెట్టవచ్చు కదా.