లేపాక్షిలో పద్య నాటక ‘ఏకపాత్ర అభినయ’ పోటీలు

సత్యసాయి జిల్లా పర్యాటక కేంద్రంగా పేరుపొందిన లేపాక్షి పట్టణం RJH ఫంక్షన్ హాల్ లో ‘తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ‘ ఆధ్వర్యంలో పద్య నాటక ఏకపాత్ర అభినయ పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (GHMC), ప్రముఖ కళా పోషకులు వేముల కొండ వెంకటేశ్వరరావు (V.V. రావు) గారి ఆధ్వర్యంలో 3 రాష్ట్రాలకు చెందిన అనేక రంగస్థల కళాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటకంగా సాగాయి. మయసభ, సత్య హరిశ్చంద్ర, రాయభారం, రామాంజనేయ యుద్ధం, పల్నాటి యుద్ధం, చింతామణి, గయోపాఖ్యానం లాంటి పౌరాణిక ఘట్టాల నుంచి అభినయించిన పోటీదారులు తామే తామే అని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

పురస్కార విజేతలు:

మొదటి బహుమతి: అందవిల్లి ప్రసాద్ (చంద్రమతి పాత్ర)
ద్వితీయ బహుమతి: ఎల్. సత్యనారాయణ (హరిశ్చంద్ర కాటి సీను) – హిరమండలం
తృతీయ బహుమతి: చింతాడ గోవిందమ్మ– ఆముదాలవలస

ప్రోత్సాహ బహుమతులు:

  1. చందు (B.Tech), శ్రీకృష్ణ పాత్ర – అప్పరాచెరువు
  2. సింగిరెడ్డి గౌరీశ్వరీ, శ్రీరాముడు పాత్ర – విజయనగరం జిల్లా

విజేతలందరికీ నగదు బహుమతులతో పాటు మెమెంటోలు, దుశ్శాలువలు, గజమాలు అందించి ఘనంగా సన్మానించారు.

విశేష ప్రదర్శనలు: ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర స్థాయి కళాకారులు కదిరేశ్వరరావు (రాయభారం), కిట్టాలపాడు శ్రీనివాస్, మంజుల, నాగభూషణం, వంకాయల మారుతి ప్రసాద్, సామవేదం బాలసుబ్రహ్మణ్యం తదితరులు “వారణాసి సన్నివేశం”ను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

బిరుదు ప్రదానోత్సవం: కళారంగానికి విశిష్ఠ సేవలందించిన ప్రముఖులను ఈ సందర్భంలో సత్కరించారు:

కళా వాత్సల్య అవార్డు – వి.వి. రావు
పద్యానాటక పురోధస – శ్రీ డా. సామవేదం బాలసుబ్రహ్మణ్యం
కళా దివిటీ బిరుదు – దేమకేతపల్లి రామనాథరావు
నటకళా ప్రమిద్ – C.V. లక్ష్మి నారాయణ స్వామి
సంగీత సింధు – శంబంగి శ్రీనివాస్
నటకళా విశిష్ఠ – వంకాయల మారుతి ప్రసాద్
యువకళాతరంగ్ – పెద్దరికం సాయి
అంతే కాకుండా పోటీలో పాల్గొన్న 22 కళాకారులకు అంజనా అవార్డు అందజేయడం విశేషం.

కళా ప్రాధాన్యతపై సందేశం: ఈ సందర్భంగా ట్రస్ట్ ముఖ్య సలహాదారులు వి.వి. రావు గారు మాట్లాడుతూ, “కళారంగం అనేది మన సంస్కృతి ప్రతిబింబం. ఇందులో స్థిరపడేందుకు నిరంతర సాధన అవసరం” అని కళాకారులను ప్రోత్సహిస్తూ, గత నాటి పేరుగాంచిన నటీనటుల నైపుణ్యాలను తెలియజేశారు.

ట్రస్ట్ అధ్యక్షుడు అంజనప్ప గారి ఆశయం: ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అంజనప్ప గారు మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో మరుగున పడిన కళాకారులను వెలికి తీసి వారికీ వేదిక కల్పించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం” అని చెప్పారు. ఈవిధంగా కళారంగానికి పునఃప్రతిష్ఠ తీసుకురావడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

ఈ ఘన విజయవంతమైన కార్యక్రమానికి సహకరించిన దేమకేతేపల్లి రామనాథ రావు గారికి, డైరెక్టర్ పెద్దరికం సాయి గారికి, కళాకారులకు, లేపాక్షి పట్టణ ప్రజలకు ట్రస్ట్ పేరు మీద ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నిర్వాహకులు.

1 thought on “లేపాక్షిలో పద్య నాటక ‘ఏకపాత్ర అభినయ’ పోటీలు

  1. మంచి ఆలోచన.. కళాకారులకు కొంతైనా ప్రశాంతత.. మానసిక ఉల్లాసం.. ఆనందం
    ఆశిద్దాం 👍👍

Comments are closed.

Share via
Copy link
Powered by Social Snap