నిన్న రాత్రి 12-10-2025, ఆదివారం గుడివాడ స్పందన ఆర్ట్స్అకాడమీ వారి ఆధ్వర్యంలో జి.వి. పూర్ణచందర్రావు కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన నాటకోత్సవంలో ప్రముఖ నాటక రంగ సమీక్షకులు సాహితీ ప్రియులు బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి నూలు సాంబశివరావు గారు ప్రదర్శించిన మయసభలో సుయోధనుని ఏకపాత్రాభినయం అశేష ప్రేక్షకుల ఈలలు, చప్పట్ల నడుమ కళాప్రాంగణం దద్దరిల్లిపోయింది.
నూలు వారికీ నాకు ఓ ప్రత్యేకమైన అనుబంధం. మా మధ్య నాటక రంగ మరియు సాహితీ చర్చలు తరచూ అనేకం జరుగుతూ ఉంటాయి. వారు ప్రధానంగా సంప్రదాయ సాహిత్య ప్రియులు. నటులకు ఈ అభిరుచి సహజత్వం కావచ్చు. ముఖ్యంగా నాకున్న అరకొర సాహితీ దృక్పథాన్ని వారు బాగా అభిమానిస్తారు.
75 సంవత్సరాల వయస్సులో కూడా ఇలాంటి గంభీరమైన పాత్రలను మెప్పించడం సాధారణ విషయం కాదు. పైగా ఈ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని వారే స్వయంగా తయారు చేసుకోవడం వారికున్న కళాభిరుచికి ఒక తార్కాణం.
కళల ఖిల్లా గుడివాడ ఇప్పటికీ తన ప్రాముఖ్యతను నిలుపుకుంటుందంటే ఇలాంటి నిబద్ధత ఉన్న కళాకారులు ఉండబట్టే.
ఇలాంటి కళలను ప్రోత్సహించి నాటక రంగానికి పునర్జీవనాన్ని ఇస్తున్న స్పందన ఆర్ట్స్ అకాడమీ వారికి హృదయ పూర్వక అభినందనలు.
–మోకా మాధవరావు, గుడివాడ, స్పందన ఆర్ట్స్
