సృష్టిలో ‘అమ్మ ప్రేమ’ అంశంపై నిర్వహించిన ‘గరిమెళ్ళ సుబ్బారావు స్మారక చిత్రలేఖనం’ పోటీలకు విశేష స్పందన
నగరానికి చెందిన ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ స్టూడెంట్స్ వింగ్ ఆధ్వర్యంలో గరిమెళ్ళ నానయ్య చౌదరి గారి సహకారంతో…1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న చిన్నారులకువిజయవాడ లో జరుగుతున్న సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్-2024 లో ఆదివారం రాత్రి జరిగిన సృష్టి లో ‘అమ్మ ప్రేమ’ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ కాంటెస్ట్ లో నగరం నలుమూలల నుంచి రెండు వందలకు పైగా చిన్నారులు పాల్గొన్నారు.తమ చిట్టి చిట్టి చేతులతో అమ్మ ప్రేమని కల్లకు కట్టినట్లుగా చిత్రించి ఆహుతులను అలరించారు.అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్చార్జి బాలాజీ, కల్చరల్ ఈవెంట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ వర్కింగ్ కమిటీ మెంబెర్స్ సునీల్ కుమార్ అనుమకొండ, గిరిధర్ అరసవల్లి, స్ఫూర్తి శ్రీనివాస్, రమేష్ అర్కాల, సంధ్యారాణి, మేడా రజని చేతుల మీదుగా విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించారు.