రోగులకు, అనాథలకు తన జీవితకాలం సేవలు అందించిన మానవతామూర్తి మదర్ థెరిస్సా ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని మాజీ మంత్రిణి నన్నపనేని రాజకుమారి అన్నారు. సోమవారం (26-8-24) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయంలో భారతరత్న మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మరియు సేవా పురస్కారాలు ప్రదానం జరిగింది. ముఖ్యఅతిధి గా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తోటి వారికి సహాయపడని జీవితం నిరర్థకం అన్నారు. సమాజచేసే వారిని గుర్తించి, గౌరవించడం మన విధి అన్నారు. డిఫ్యూటీ కలెక్టర్ కె. కృష్ణవేణి మహిళలు చైతన్యవంతులుగా మారాలని సూచించారు. కృష్ణాజిల్లా పరిషత్ పూర్వపు చైర్ పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ సమాజంలో దీన, హీనస్థితిలో ఉన్న అభాగ్యులను మదర్ థెరిస్సా హక్కున చేర్చుకుని సేవలు అందించారని కొనియాడారు. సభాధ్యక్షులు, ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు కొల్లూరి ప్రసంగిస్తూ సేవచేసేవారిని అవార్డులతో సత్కరించడం వలన వారు మరెన్నో ఉత్తమ సేవలు అందిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ఠ సేవలు అందించిన కొండ్రెడ్డి వెంకట సత్యనారాయణ (కైకలూరు), కొమ్మెర్ల లలిత ప్రసాద్ (పొదలకూర్), డాక్టర్ శిల్పి డి దేవికారాణి (తాడేపల్లిగూడెం), శ్రీరాం రాజేశ్వరరావు (క్రోసూరు), జె.సి. రాజు (బొబ్బిలి), పి. భాను ప్రసాదరావు (పెనికేరు), ఎన్. మనోహర్ నాయుడు (చిత్తూరు), వి.వి.వి.ఎస్.ఎన్. మూర్తి (ఖమ్మం), ఆర్. గణేశ్వరబాబు(విశాఖ), ఎస్ లిల్లెమ్మ (జి కొండూరు), డి.వి.ఎస్. రామలింగరాజు, ఎన్ సూర్యారావు, ఆచంటి సునీత, పి. రాజేశ్వర శర్మ, పురాణం లక్ష్మీనరసమ్మ, తాళ్ళూరి ప్రవీణ్, దుంపల లక్ష్మీకుమారి, పోలిసెట్టి శ్రీనివాసరావు, ఇంటి రాజు, జి.వి. సుబ్రహ్మణ్యం (విజయవాడ) లకు మదర్ థెరిస్సా సేవా అవార్డు లు అందించి సత్కరించారు. సత్కారితులు తమ స్పందన తెలిపారు. కవి రవీంధ్రబాబు, కవయిత్రి సి.హెచ్. అన్నామణి అవార్డు గ్రహీతలను పరిచయం చేసారు. సభ ప్రారంభానికి ముందు నృత్యప్రదర్శన చేసిన తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి కి చెందిన కుమారి బానోత్ అలకనంద రాథోడ్ ను “నాట్యమయూరి” బిరుదుతో సత్కరించారు.
సభలో బి.జె.పి. రాష్ట్ర ఒ.బి.సి. కోశాధికారి బి.ఎస్.కె. పట్నాయక్ ప్రసంగించారు. ఎక్స్ రే కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, కోశాధికారి చామర్తి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు బి. వసంత కుమార్, కొల్లూరి కనకవల్లి, జి ఏడుకొండలు, కె. రాము, కొల్లా జయశ్రీ కార్యక్రమ పర్యవేక్షణ చేసారు.
-బి. ఆంజనేయ రాజు