అమ్మలకు ‘కల’లుంటాయి- షార్ట్ ఫిల్మ్

ప్రతిభను ప్రదర్శించ డానికి యూట్యూబ్ గొప్ప వేదిక అయ్యింది ప్రస్తుతం. ఇటీవల నేను చూసిన ఒక షార్ట్ ఫిల్మ్ గురించే నా ఈ స్పందన…!

ఇది హార్ట్ టచింగ్ షార్ట్ ఫిల్మ్ అని మీరు అనడం కంటే, చిత్రం చూసిన మేము అనాల్సిన మాట. ఇది మనస్సున్న మేము అనాలి.
నిజమే…
ఈ చిత్రం నిర్మించిన శ్రీ కంఠంనేని రవి శంకర్, శ్రీ ఘండికోట ప్రసన్న ముందుగా అభినందనీయులు.

కధ రాసిన శ్రీ గంగుల నరసింహారెడ్డి గారు సున్నితమైన విలువలు తెలియచేసారు. సంతోషం.
ఇందులో.. కధనం, దర్శకత్వం ప్రేక్షకుణ్ణి బాగా ఆకట్టుకున్నాయనవచ్చు పాత్రలకు చక్కని రూపాలను ఇచ్చిన మంజునాధ్ అభినందనీయుడు.
మా కళ్ళకి హాయిగాపాత్రల్ని, సన్నివేశాల్ని”నయనమనోహరం”గా చూపించిన “ఛాయాచిత్రగ్రాహకులు”
శ్రీ యువతులు మనోజ్, సాయిగార్లు చిత్ర విజయానికి బాగా “కళ్ళు”పెట్టారు. మిగతా సాంకేతిక ప్రవీణులు అందించిన సహకారం ప్రావీణ్యం తోనే చిత్రం బాగుంది కదా!

తల్లి విశాలాక్షి పాత్ర పోషించిన శ్రీమతి ం.సుహాసినిగారు మాట, మాటకు తగ్గ శరీర కదలిక, వాటికి తగినట్లుగా చక్కని ముఖ కవళికలతో పాత్రకు జీవం పోశారు.
అందరి ప్రశంసలు పొందేటట్లుగా చాలా బాగా అభినయించారు. తతిమా వాళ్ళు దర్శకుల సూచనలతో పాత్రోచితంగా నటించారు. ఓడిపోయిన క్లయింట్ గా శ్రీ కొల్లా రాధకృష్ణగారు కనిపించారు.
ముఖ్యంగా ఈ చిత్రం బాగుండటానికి కారణం భాస్కర్ చంద్ర “దర్శకత్వ”మే.

మీనాక్షి ని ఫుట్ బాల్ గ్రౌండ్ లో పూర్తి చూపించకుండా, సస్పెన్స్
చూపించడం, మీనాక్షి ఇంటికి వెళ్ళినప్పుడు.. అలంకరణ వస్తువులు, పెయింటింగ్ఫ్రేములు ఆత్మీయత తడమడం, పుస్తకాల అల్మరాని ప్రేమతో చూడటం ఆమె‌ మనసు లోని కోరికలకు, తపనకు ప్రతిబింబం.
బాగా నచ్చిన సన్నివేశం ఏమిటంటే… చొక్కాగుండీలు లాంటివి కుడుతూ, ఆ పని ఆపి, మీనాక్షి ఇల్లు చూపించడానికి లేచి, కొడుకు, కోడలితో కలిసి ముందుకువచ్చి, ముఖంలో చక్కటి ఆశతో, నెమ్మదిగా కుడిచెయ్యి పైకెత్తి చూపించడం హైలైట్. అని నా భావన.
ఈ చిత్రానికి ఇదిగొప్ప విషయం. విశాలాక్షి:: మీనాక్షి:: విశాలాక్షి ద్విపాత్రాభినయం (మనసు) చాలా గొప్ప గొప్పగా వుంది. సంభాషణలు చాల బాగున్నాయి. (మెకానిక్ పని అయిపోయి, వెళ్ళేటప్పుడు అతని పనిముట్ల బ్యాగ్ అతని భుజాన వుంటే బాగుండేది. అలాగే, అతనికి రావలసిన ఎమౌంట్ సెల్ ఫోన్ లో ఫొనె ఫయ్ చేస్తే బావుండేది అనిపించింది నాకు) మొత్తం మీద..”అమ్మలకు కలలుంటాయి” చాలా చాలా బాగుంది.

ఇందులో నటిచిన నటీనటులకు, సాంకేతికి నిపుణులకు నా శుభాకాంక్షలు.

“కళామిత్ర” అడివి శంకరరావు
విశ్రాంత -సీనియర్ మేకప్ ఆర్టిస్ట్
mobile : 6301002268.

ఈ షార్ట్ ఫిల్మ్ క్రింది లింక్ లో చూడండి…
https://www.youtube.com/watch?v=bFSSROFIb_0

SA: