మాతృమూర్తికి ‘చిత్ర’ నీరాజనం

మే 8న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఫోయలో ‘ఐ డిఫైన్ మై వైబ్ పేరున చిత్రకళా ప్రదర్శనతో మాతృమూర్తికి నీరాజనం సమర్పించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు అని అంటారు. నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు, మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే కానీ నేటి అమ్మ ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తుంది. కొందరు అమ్మతనంలోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతను గుర్తించుకోవాలి పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి. కనిపించే దైవం అమ్మ. అనురాగానికి చిరునామా అమ్మ. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశించే ఏ చిన్న తప్పు చేసిన కడుపులో దాచుకొని కనిపిస్తుంది. ఎంత ఎదిగి దూర తీరాలకు వెళ్లిన ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. అలాంటి తల్లుల గురించి ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన నిర్వహించడం అభినందనీయం.

Art show poster inauguration by Srinivas Goud


ఈ చిత్రకళా ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన పికాసో సంస్థ డైరెక్టర్ బి. రమేష్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 8 నుండి నుండి 18వ తేదీవరకు నిర్వహించనున్న ఈ చిత్రకళా ప్రదర్శనలో మాతృత్వం ప్రాముక్యత ఉట్టిపడేలా 8 మంది మహిళా చిత్రకళాకారిణిలు వివిధ రకాల మీడియంలలో రంగులు మేళవించి అద్భుతమైన చిత్రాలతో కనువిందు చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్ బైరు రమేష్ తెలిపారు. 8వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ చిత్రకళా ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, విశిష్ట అతిథులుగా భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు ఎం. హరికృష్ణ, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డిఐజి బి.సుమతి, ప్రొఫెసర్ ఎం. వెంకటేశం, చిత్రకారిణి బి. పద్మరెడ్డి తదితరులు పాల్గొని లాంఛనంగా ప్రారంభిస్తారని బి. రమేష్ వివరించారు. ఈ ప్రదర్శన ఔత్సాహికుల సందర్శనార్ధం ప్రతిరోజూ ఉదయం 11 నుండి రాత్రి 7 గంటలకు అందుబాటులో ఉంటుందని, కళాప్రియులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రదర్శనను తిలకించి కళాకారిణులను ప్రోత్సహించి, ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.

SA:

View Comments (1)

  • నైస్ ప్రోగ్రాం...నైస్ ఆర్టికల్