
ఒక చిత్రాన్ని సృజన చేయాలంటే చిత్రకారుడు పడే తపన… పొందే ఆనందాన్ని వర్ణించనలవికాదు. అలాంటిది అక్షరాల వెయ్యి (1000) రూప చిత్రాలు గీయడమంటే మాటలా? ఆ కలను సాకారం చేసుకున్నాడు విజయవాడ కు చెందిన చిత్రకారుడు బాబ్జీ కె. మాచర్ల. ఇంతకీ ఈ చిత్రాలన్నీ కుంచెతో వేసినవనుకుంటున్నారా ? కాదు కేవలం మౌస్ తో గీసినవంటే ఆశ్చర్యంగా వుందా? నిజమండీ అందుకే “మౌస్ ఆర్ట్ లో ‘బాస్ ‘ బాబ్జీ ” అన్నాను.
చిత్రకారులు ఎన్నో రకాలు. అవసరార్థం వేసేవారు కొందరయితే.. ఆలోచనతో, అలవోకగా, నిబద్ధతతో… వేసేవారుకొందరు. రెండవ కోవకు చెందిన చిత్రకారుడే బాబ్జీ… నాలుగేళ్ళ కాలంలో మౌస్ తో ‘వెయ్యి ‘గలిగిన బాబ్జీ సరి కొత్త రికార్డు నెలకొల్పారు. అయినా రికార్డుల కోసం ఈ పని చేయలేదు బాబ్జీ. ఎదుకంటే రికార్డులంటే బాబ్జీ గారికి ఇష్టం వుండదు కనుక. ఆయన కోరుకుంటే ఈపాటికే ఎన్ని రికార్డులు అయన్ని వరించేవో? వంద-రెండొందలు బొమ్మలేసిన ఎంతో మంది కళాకారులు రికార్డుల వెంట పడుతున్నారు నేడు.

వివిధ రంగాల్లో చెందిన కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, సామాజిక సేవకులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, టివి / సినీ రంగ నటులు, దర్శకులు, స్నేహితులు… ఒకరేమిటి అన్ని రంగాలవారి చిత్రాలను చిత్రించడమే కాదు… వారి గురించి సంక్షిప్త సమాచారాన్ని కూడా పొందుపరచి ‘ఫేస్ బుక్‘ వేదికగా సమాజం పట్ల బాధ్యతతో ఒక ఆర్టిస్టుగా వెయ్యి మంది అసామాన్యుల చిత్రాలు గీయడం అభినందించదగ్గ విషయం. ఇందులో రేఖాచిత్రాతో పాటు రంగుల చిత్రాలూ వున్నాయి. సోషల్ మీడియా అంటే ఏదో టైం పాస్ కోసం అనుకునే వారికి బాబ్జీ మంచి సందేశం ఇచ్చారు ఈ చిత్రాల ద్వారా.
999 చిత్రాలను పూరిచేసిన బాబ్జీ తన సృష్టించే వెయ్యో చిత్రంగా ఎవరిది గీయాలి? అని మదనపడి, అలోచించి తన ఆశల స్వప్నాన్ని నిజం చేసిన వారి అబ్బాయి డాక్టర్ ‘సృష్టి ‘ ని ఎంచుకొని, తన కళాతృష్ణకు, కళాసృష్టికి మరింత పుష్టి కల్గించాడు.
చిరకాలం శ్రమించి గీసిన ఈ ప్రతిరూపాలు కలకాలం నిలవాలంటే …! వీటిని ఒక పుస్తక రూపంలో కూరిస్తే మరింత బావుంటుందని నాదొక సూచన..
మౌస్ ఆర్టిస్ట్ బాబ్జీ ఈ కళలో ‘మౌంట్ ఎవరెస్ట్ ‘ లా ఎదగాలని 64కళలు.కాం పత్రిక ఆకాంక్ష.
బొమ్మలు బాబ్జీ ఫేస్ బుక్ లో చూడవచ్చు: https://www.facebook.com/babjik.macharla
-కళాసాగర్
Hearty Congrats Babji garu
మౌస్ ఆర్టిస్ట్ బాబ్జీ ఈ కళలో ‘మౌంట్ ఎవరెస్ట్ ‘ లా ఎదగాలని 64కళలు.కాం పత్రిక సంపాదకులు మరియు వ్యాస రచయిత కూడ అయినటువంటి శ్రీ కళాసాగర్ గారి ఆకాంక్ష సఫలం కావాలని నేను కోరుకుంటున్నాను. అభినందనలు…
SEEMS GREAT. GIVE WEBSITE (IF ANY) NAME. (BECAUSE I DON’T HAVE ANY FACEBOOK ACCOUNT)