ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో మరో సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. మే 10 తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సుమంత్ ఆర్ట్ప్రొ డక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వాములుగా ఎంఎస్ రాజు తనయుడు, నటుడు సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్న హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన.. నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ 7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్.. మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం.” అని తెలిపారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. “యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘
డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap