పవన్ రస్తోగి (39) గారు. విభిన్న మాధ్యమాలలో నైపుణ్యం వున్న కళాకారుడు. పరఫెక్ట్ స్ట్రోక్స్ ఆర్ట్స్ అకాడమీ, ఎల్లా రెడ్డి గూడ, హైదరాబాద్.
గతంలో చేస్తున్న ప్రవేటు ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా ఫుల్ టైమ్ “ఆర్ట్ ఫీల్డ్-ఫైన్ ఆర్ట్స్”ను ఎంచుకున్నారు. యానిమేషన్, ఆయిల్ పేయింటింగ్స్, అక్రిలిక్ పేయింటింగ్స్, వాటర్ కలర్స్ పేయింటింగ్స్, 3డి మూరల్స్, పేయింటింగ్స్, డ్రాయింగ్స్, స్కెచ్చింగ్స్, తంజావూర్ పేయింటింగ్స్, కాఫి పేయింటింగ్, కేరళ పేయింటింగ్స్, గ్లాస్ పేయింటింగ్స్, సింగల్ స్ట్రోక్ పేయింటింగ్స్, పాట్ పేయంటింగ్స్, పాలిమర్ క్లే, టెర్రకోట, జ్యూవలరీ, క్విల్లింగ్, పంచ్ క్రాఫ్ట్స్, చాక్లెట్ తయారి, క్యాండిల్ తయారీ, ఇలా దాదాపుగా నలభైకి పైగానే, అంటే ఇంచు మించు ఆల్ రౌండర్ గా ఎన్నో, అన్ని రకాల పనులకు కేరాఫ్ పవన్ రస్తోగి అని చెప్పవచ్చును. పవన్ రస్తోగి, సుధ స్రవంతి భార్య భర్తలు. వీరిద్దరూ కలిసి ఇనిస్టిట్యూట్ ను నడుపుతున్నారు. వీరిద్దరూ గొప్ప కళాకారులే. ఒకరిని మించిన ఒకరు కళాకారులు. పవన్ గారి కళ కాస్త విభిన్నమే. అయినా పవన్ గారి నేపధ్యంకూడా సుధా స్రవంతి వలే ఉంటుంది ఎందుకంటే ఏ పనైనా కలిసే చేస్తారు కాబట్టీ.
అయిదు సంవత్సరాల నుండి “పరఫెక్ట్ స్ట్రోక్స్ ఆర్ట్ అకాడమీ” ఇనిస్టిట్యూట్ లో చాలా మంది విద్యార్ధులు నేర్పుతున్నారు. పిల్లలే కాదు, రిటైర్మెంట్ అయిన వాళ్లు, చిన్నప్పుడు తీర్చుకోలేని, నేర్చుకోలేని వాళ్లుకు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. వీరు చేసిన కళాఖండాలు ఎన్నో కళాభిమానుల ఇళ్ళలో అలరిస్తున్నాయి. దేశ, విదేశాలనుంచుకూడా ఆర్డర్స్ వస్తుంటాయి. స్టూడెంట్స్ కు ఏ అంశంపై ఆశక్తి వుంటే, ఆ అంశంపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ ఇనిస్టిట్యూట్ లో నేర్చుకునే పిల్లలకు ఫేవరేట్ ఏమిటని అడిగితే “మా ఆర్ట్ టీచర్ పవన్ సార్ అని ఠక్కున చెబుతారు. ఎందుకంటే అందమైన చిరు నవ్వుతో అందరినీ పలకరిస్తారు పవన్ గారు. ఎలాంటి వారికైననూ ఆర్ట్ టీచర్ గా ఎన్నో కళలను తీర్చిదిద్దగల పవన్ రస్తోగి సార్ అంటే మాకెంతో అభిమానం అంటారు పిల్లలు.
ఈ ఇనిస్టిట్యూట్ వల్ల తృప్తిగాను, సంతృప్తిగాను వున్నాము అంటారు భార్య భర్తలు. సంవత్సరానికి నూట యాభైకి పైగానే పిల్లలకు, పెద్దవాళ్లకు శిక్షణ ఇస్తాము. ప్రస్తుతం డెబ్భై మంది దాకా ఉన్నారు. విశేషమేమంటే సినీ నటుడు అలాగే చిరంజీవి గారి మనవలు, మనవరాలకు, అల్లు అర్జున్ గారి పిల్లలకు, ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెబుతారు పవన్ గారు. పవన్ గారు వాటర్ కలర్స్ తో మ్యూజిక్ ఇనిస్ట్రుమెంట్స్ లను సూక్ష్మ చిత్రాలను చిత్రించడం విశేషం.
రెగ్గులర్ గా ప్రతి కళా పోటీలకు మా ఇనిస్టిట్యూట్ నుంచి చాలా మందిని పంపుతూ వుంటాము. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, వివిధ రకాల అవార్డులతో పాటు పార్టిస్పేటడ్ సర్టిఫికేట్లు వస్తుంటాయి. మేము చేసినవి చాలా వరకు కమర్షియల్ గా, ఆర్డర్స్ మీద తీసుకుంటాము. ఎప్పుడూ 50-60 ఫ్రేములు రన్నింగ్ లో ఉంటాయి. పేరొందిన ప్రముఖులు ఆర్డర్స్ పై ఇస్తుంటారు. అలాగే తీసుకువెళ్లతారు. “నివ్రాన్స్ డిజైనర్ హోమ్స్” సంస్థ వారికి సంబంధించిన ఆర్ట్ వర్క్స్ మొత్తం వీరే చెయ్యడం విశేషం.
మరో విశేషం ఏమంటే, భవిష్యత్ లో ఈ ఇనిస్టిట్యూట్ కు వారసులు ఈ ఇనిస్టిట్యూట్ లోనే శిక్షణ పొందుతున్నారు. వారే వీరి పిల్లలు. పవన్ రస్తోగి గారి అమ్మాయి, అబ్బాయి. వీరిద్దరూ కూడా కాబోయే మంచి కళాకారులు.
చివరిగా “కళ వల్ల మానసిక ఆనందాన్ని కలుగుతుంది-ఎదుటి వారిని ఆకర్షించే గుణం ఉంది. చదువు/ఉద్యోగంతో గుర్తింపునిచ్చేది కళ” అంటారు పవన్ రస్తోగి.
– డా. దార్ల నాగేశ్వర రావు