ఎం.వి. రామారావుగారి 11 వ రంగస్థల పురస్కారం

ప్రఖ్యాత రంగస్థల, రేడియో, టీవీ, చలనచిత్ర నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త, నాటక రచయిత, న్యాయ నిర్ణేత, కీర్తి పురస్కార గ్రహీత కీ.శే శ్రీ ఎం.వి. రామారావుగారి రంగస్థల పురస్కారం దశాబ్ద కాలంగా వారి జయంతి రోజున ఆగష్టు 11 నాడు ప్రతియేటా విశిష్ట సేవలు అందించిన రంగస్థల ప్రముఖలకు శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ప్రధానం చేయడం జరుగుతోంది. గతంలో ప్రకటించిన విధంగా 2020 సంవత్సర 10వ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, రేడియో, టీవీ, చలనచిత్ర నటులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణగారికి, శ్రీ ఎం.వి. రామారావుగారి 84వ జయంతి సందర్భంగా 2021 సంవత్సరానికి గాను ఎంవి రామారావు 11వ రంగస్థల రంగ పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, రేడియో, టీవీ, చలనచిత్ర నటులు, దర్శకులు శ్రీ ఉప్పలూరి సుబ్బరాయ శర్మగారికి ప్రధానం చేస్తున్నామని త్వరలోనే పురస్కార ప్రదానోత్సము జరుగుతుందని శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కే. వాసవదత్త రమణ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్వ అవార్డు గ్రహీతలు:
*2011 – శ్రీమతి పద్మలత
*2012 – శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు
*2013 – శ్రీ విద్యసాగర్
*2014 – శ్రీమతి విజయలక్ష్మి
*2015 – శ్రీ కాకరాల
*2016 – శ్రీ శ్రీపాద కుమారశర్మ
*2017 – శ్రీ అమరేంద్ర
*2018 – శ్రీ ఈరంకి సీతారామయ్య
*2019 – శ్రీమతి సిహెచ్ బృంద
*2020 – శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ

కామరాజుగడ్డ వాసవదత్త రమణ
(ప్రధాన కార్యదర్శి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap