కుమిలి పేరుతో కార్టూన్లు గీసిన నా పూర్తి పేరు కుమిలి నాగేశ్వరరావు. పుట్టింది మే 10 న 1959, విజయనగరం జిల్లా, శివరాం గ్రామంలో. తల్లిదండ్రులు కుమిలి అప్పలనాయుడు, పైడితల్లి. చదివింది బి.కాం. చిన్నప్పటినుండి బొమ్మలు అంటే ఆశక్తితో గీస్తూండేవాడిని.
1975 సం.లో మద్రాసులో డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష పాసై, అదే సంవత్సరం కాకినాడలో డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసాను. ఉద్యోగవేటలో విసిగి వేసారి పదేళ్ళు కమర్షియల్ ఆర్టిస్ట్ గా కొనసాగి, చివరికి 1987 సంవత్సరంలో ఎల్.ఐ.సి. ఏజంట్ గా చేరాను. ఇది నా లైఫ్ లో గొప్ప మలుపు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం చైర్మన్ క్లబ్మెంబర్ స్థాయికి ఎదిగాను. ఎల్.ఐ.సి. ఏజంట్ దేశంలో అనేక ప్రదేశాలు సందర్శించే అవకాశం కూడా కలిగింది. అలాగే మా గ్రామానికి రెండు పర్యాయాలు సర్పంచ్ గా సేవలందిచాను. విజయనగరం జిల్లా నుంచి ఉత్తమ పంచాయితి అవార్డ్ అప్పటి కలెక్టర్ పూనం మాలకొండయ్య చేతుల మీదుగా సర్పంచ్ గా అవార్డ్ అందుకున్నాను.
స్వహతాగా కార్టూనిస్ట్ అయిన మా గురువు అల్లువాడ నీలకంఠేశ్వర రావు గారి ప్రోత్సాహంతో కార్టూన్లు ఎలా గీయాలో నేర్చుకొన్నాను. నా తొలి కార్టూన్ 1983 సం.లో క్రోక్విల్ హాస్యప్రియ దీపావళి సంచికలో అచయ్యింది. దాంతో నా ఉత్సాహం రెట్టింపు అయింది. కార్టూనిస్టులు బాపు, ఆర్.కె. లక్ష్మణ్, జయదేవ్, శ్రీధర్, సుభాని గార్ల కార్టూన్లంటే నాకు బాగా ఇష్టం. పాఠకుల అభిమానంతో ఆంధ్రభూమి, ఆంధజ్యోతి, ఆంధ్రప్రభ, స్వాతి, విజయ, హాస్యానందం, మయూరి, వనితాజ్యోతి పత్రికల్లో సుమారు వెయ్యికి పైగా కార్టూన్లు గీసాను. విశాఖ నుండి వెలువడే స్మైల్ ప్లీజ్ మాసపత్రికలో రెండేళ్ళ పాటు ఆర్టిస్ట్ కం కార్టూనిస్టుగా పనిచేసాను.
నా ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన నా అర్థాంగి శ్రీమతి రమణమ్మకి ఋణపడివుంటాను. నాకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. పెదబాబు వెంకటప్పలనాయుడు సివిల్ సర్వీస్ లో ఐ.ఎఫ్.ఎస్. అఫీసర్ గా తమిళనాడు కేడర్లో పనిచేస్తున్నాడు. చినబాబు సురేష్ బాబు ఎల్.ఐ.సి. ఏజంట్ పనిచేస్తున్నాడు. కుమార్తె వెంకట రట్నం స్కూల్ టీచర్.
చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా అనేక బహుమతులు అందుకున్నాను. సైలెంట్ కార్టూన్లు ఎక్కువగా గీయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం కార్టూన్లకు ఆదరణ లేకపోవడం వల్ల ఈ రంగంలోకి రావడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. కార్టూనిస్టులందరిని కలుసుకోవాలన్నది నా ఆశ.
-కుమిలి
కుమిలి గారు చక్కని కార్టూనిస్టు..వివరాలు తెలిపినందుకు సంతోషం.
కుమిలి కార్టూనిస్ట్ గారి గురించి వివరాలు తెలిపినందుకు ధన్యవాదములు.
Very nice
CONGRATS K.N.R.
కుమిలి గారు మీ కార్టూన్లు బాగుంటాయి. మీ గురించి చాలా బాగా చెప్పారు.