హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …
నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం(21-11-20)హైదరాబాద్ లో దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ‘నాగాస్త్ర ‘ పేరిట నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ కె.వి.రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం కాస్ట్యూమ్ డిజైనర్ బి. నాగయ్య మాట్లాడుతూ … “కాస్ట్యూమ్ డిజైనర్ గా దివంగత శోభానాయుడు గారు నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు, ఆమె ఉండి ఉంటే ఎంతో సంతోషించే వారన్నారు. ” నాగాస్త్ర దిగ్విజయం కావాలని, కళాకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాస్ట్యూమ్ డిజైనర్ బి. నాగయ్య మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా నృత్య కళాకారులకు దుస్తులు అందిస్తున్నామని, ఇప్పుడు ఆధునిక హంగులతో మరింత అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ వేడుక లో జయ జయ శంకర టీవీ సీఈఓ డాక్టర్ ఓలేటి పార్వతీశం, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, ప్రజా గాయని సుద్దాల భారతి, సుజాతామూర్తి, ఓలేటి హైమావతి, బి.మానస, సురభి రఘునాథ్, సురభి కిషోర్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఫోటో రైటప్: జ్యోతి ప్రజ్వలన చేసి, నాగాస్త్ర ప్రారంభించి శోభానాయుడు కు నివాళులు అర్పించిన డాక్టర్ కె వి రమణాచారి, డాక్టర్ మహ్మద్ రఫీ, డాక్టర్ ఓలేటి పార్వతీశం, శ్రీ బి.నాగయ్య తదితరులు.