గుడిపాటికి డా.నాగభైరవ పురస్కారం

ఆగస్టు 14న శనివారం సాయంత్రం 5 గంటలకు డా. నాగభైరవ 10వ అవార్డు ప్రదానోత్సవ సభ జూమ్ వేదికలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కె.శివారెడ్డి, నిఖిలేశ్వర్ హాజరయ్యారు. పురస్కార వ్యవస్థాపకులు ‘మాట’ దీర్ఘకావ్యం రూపశిల్పి చిన్ని నారాయణరావు నిర్వహణ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో గుడిపాటి రచించిన పుట్టబంగారం’ ఉత్తమ విమర్శ గ్రంథానికి పురస్కారం అందించారు. రు.5,000/ -ల నగదు, జ్ఞాపిక, దుశ్శాలువాతో గుడిపాటిని హైదరాబాద్లో కె.శివా రెడ్డి, నిఖిలేశ్వర్లు సత్కరించారు. సభలో డా॥ నాగభైరవ సాహిత్య పీఠం వ్యవస్థాపకులు డా.నాగభైరవ ఆదినారాయణ, కోటేశ్వరరావు తన యులు నాగభైరవ వీరబాబు, కవులు బిక్కి కృష్ణ, బీరం సుందరరావు, శ్రీరామకవచం సాగర్, డా.రావి రంగారావు, విల్సన్‌రావు కొమ్మవరపు, ఏటూరి నాగేంద్రరావు, పి.శ్రీనివాస్ గౌడ్, బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, మల్లెతీగ కలిమిశ్రీ, హైదరాబాద్ లో జూమ్ కి సాంకేతిక సహకారం అందించిన రాపోలు సీతారామరాజు పాల్గొన్నారు.
ఇంకా ఈ సభలో రు.1,000/-ల ప్రత్యేక నగదు పురస్కారం పొందిన డా. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, కె.వి.రమణారెడ్డి, డా.అమళ్ళదిన్నె వెంకట రమణ ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీ ఎన్జీవోస్ నెట్ వర్క్ జాతీయ కార్యదర్శి జ్యోతి మువ్వల హోస్టుగా వ్యవహరించారు.

SA: