దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం త్యాగం దేశభక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా యూనివర్సిటి ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ అన్నారు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రముఖులకి విశ్వదాత అవార్డులు అందచేసారు.
విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ప్రముఖ విశ్లేషకులు గ్రంధాలయ ఉద్యమకారులు డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు, ప్రముఖ రచయిత్రి తేళ్ళ అరుణ, ఓఎస్డి ఎన్.ఎస్.కే. ఖాజావలి, ప్రముఖ జర్నలిస్టు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు రాజమండ్రి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పసుమర్తి శ్రీనివాస శర్మలకు కృష్ణా యూనివర్సిటి ఉపకులపతి ఆచార్య కె.బి. చంద్రశేఖర్ ఎన్టీఆర్ జిల్లా రెవిన్యు అధికారి కె. మోహన్ కుమార్ విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ కార్యదర్శి కాశీనాధుని నాగేశ్వరరావులు అవార్డులు జ్ఞాపికలు ఇచ్చి దుశ్యాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సభలో కృష్ణా యూనివర్సిటి ఉపకులపతి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ అడుగుజాడల్లో నాగేశ్వరరావు పంతులు తాను నడుస్తూ పలువురిని నడిపించారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి కే మోహన్ కుమార్ మాట్లాడుతూ నాగేశ్వరరావు పంతులు మద్రాసులోని నివాసంలో జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దోహదపడిందన్నారు. బ్రహ్మకు రచయిత డాక్టర్ జివి పూర్ణచంద్ మాట్లాడుతూ నాగేశ్వరరావు పంతులు గ్రంథాలయ ఉద్యమం ద్వారా పుస్తక పఠనంపై తెలుగు వారిని నడిపించగలిగారన్నారు. ఎలకుర్తి కొన్ని గ్రామాలలో నాగేశ్వరరావు పంతులు అందించిన సేవలు పరువాలే మన్నారు. ఆయన వంశీకులు నాగేశ్వరరావు ఏలూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాల వారికి సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అవార్డు గ్రహీతలు సాధించిన విజయాలను వివరించారు ఈ కార్యక్రమంలో ముదిగొండ శాస్త్రి, కిషోర్ నెల్సన్ పాల్ తదితరులు మాట్లాడారు.