పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు

నందు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు పూర్తి పేరు గుంటి దయానందు, పుట్టింది 5 ఏప్రిల్ 1979 తెలంగాణాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు గుంటి సత్తయ్య, రాములమ్మ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బి.ఏ. డిగ్రీ చేసాను.
కొంతమంది స్నేహితులతో కలసి వినాయకచవితి స్టేజీల మిద నాటికలు, జోకులు ప్రదర్శించేవాళ్లం. కళాభారతి సాంస్కృతిక నిలయం పేరుతో మిత్రుడు బింగి సత్యనారాయణ, నా ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల గ్రామంలో ప్రదర్శనలిస్తూ ముందుకు సాగాము, ఆ క్రమంలో సత్యనారాయణ కథలు రాసి, పేపర్లకి పంపుతుండేవాడు, నాకు బొమ్మలంటే ఇష్టం ఉ ండటంతో తను కాన్సెప్టు చెబితే నేను కార్టూన్లు గీస్తూండేవాడిని. .
కొంత కాలం తర్వాత తను టీవీ సీరియల్స్ కి వర్క్ చేయడంతో నేనే కాన్సెప్ట్ అనుకుని కార్టూన్లు వేస్తూ వచ్చాను. మొదట్లో కార్టూనిస్టు మృత్యుంజయ కార్టూన్లను చూసి స్పూర్తి పొందాను. నా మొదటి కార్టూను 2003 లో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం అయ్యింది.


మూడు నాలుగు వందల కార్టూన్లు ప్రచురితం అయ్యాక, ‘తేజ’ న్యూస్ వీక్లీలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను తర్వాత ‘నవీన విద్య’ మాస పత్రికకు ఆర్టిస్టుగా పనిచేశాను. 3 సంవత్సరాలు చేశాకా రామోజీ ఫౌండేషన్’ తెలుగు – వెలుగు పత్రికలో చిత్రకారునిగా ఉద్యోగం చేశాను. అక్కడ కార్టూన్లకన్నా ఇలస్ట్రేషన్ అవసరం ఉండటంతో ఇలస్ట్రేషన్ పై దృష్టి పెట్టి 7 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆర్టిస్టుగా పనిచేస్తున్నాను.
రామోజీ ఫౌండేషన్లో పనిచేసేటప్పుడు అక్కడి ఇన్చార్జి వాళ్లు బాగా ప్రోత్సహించారు. నన్ను నేను మెరుగుపరుచుకోవటానికి ఓ సదవకాశంగా భావించి ముఖచిత్రాలు, ఇలస్టేషన్, కవితలకు బొమ్మలు, కార్టూన్లు ఇలా చాలా బొమ్మలు వేశాను,
జమీన్ రైతు వార పత్రికకు కూడా కార్టూనిస్ట్ గా పనిచేశాను. అవార్డుల విషయానికి వస్తే నేను పోటీల్లో పాల్గొన్నది చాలా తక్కువే రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కొన్ని కార్టూన్ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పటి వరకు 3000 కార్టూన్లు గీసాను. –
2007లో సంఘమిత్ర, అక్షర సంస్థల సంయుక్తంగా నా కార్టున్ల ప్రదర్శన నిర్వహించారు, ‘చేనేత రంగం సంక్షోభం’ పై 30 కార్టూన్లను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ ప్రదర్శన జరిగింది. హాస్యానందం పత్రికకు పంపిన నా కార్టూన్ చూసి బాపుగారు మెచ్చుకుంటూ అభినందనలు తెలియజేశారు. ఈ విషయం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోని సంఘటన, ‘ఆంధ్రజ్యోతి’ నవ్యవీక్లీకి చాలా బొమ్మలు వేశాను, కార్టూన్లు ఇలస్టేషన్స్ రెండూ ఇష్టమే, అప్పుడప్పుడు కార్టూన్లు వేస్తూనే వున్నా ఎక్కువ సమయం ఇలస్ట్రేషన్ వేస్తున్నాను.
– నందు

4 thoughts on “పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు

  1. నందు గారి కార్టూన్లు బాగుంటాయి. బొమ్మలు మరీ ముద్దొస్తాయి.

  2. మీ కార్టూన్లలో బొమ్మలు ,హాస్యం రెండూ బావుంటాయి . వ్యాఖ్య చిన్నదిగా వుంటుంది . నిజమైన కార్టూన్ అలాగే కదా వుండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap